సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడం అనేది అంత ఈజీ కాదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎక్కడో ఒక చోట ఏదో ఒక తప్పు అనేది కనబడుతూనే ఉంటుంది. దానిని పట్టుకుని విపక్షాలు చేసే ఆరోపణలతో కూడా అధికార పార్టీలు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూనే ఉంటాయి. రాజకీయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కొన్ని కొన్ని పరిణామాలు ఇబ్బందికరంగానే ఉన్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

ఒకపక్క ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే సీఎం జగన్ మాత్రం సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం సీఎం జగన్ ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విషయంలో అధికార పార్టీ నేతలు జోక్యం ఎక్కువగా ఉంటుంది అనే భావన ప్రజల్లో కూడా వ్యక్తమవుతుంది. ఇదే విపక్షాలకు కాస్త అనుకూలంగా మారుతుంది అని సీఎం జగన్ కూడా భావిస్తున్నారు.

దీనితో ఆయన ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే కార్యక్రమాలు అమలు చేయకుండా ఎవరైతే అడ్డుపడుతున్నారో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే విధంగా కూడా సీఎం జగన్ సీరియస్ గానే ఉన్నారని అంటున్నారు. తమ వారికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం ద్వారా పార్టీ నష్టపోతుందని అనే భావన సీఎం జగన్ లో వ్యక్తమవుతోంది. తనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఉండాలి అని జగన్ చెప్పినా సరే కొంత మంది మాత్రమే ఓటు వేసిన వారికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విధంగా ముందుకు వెళ్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: