పురాతన కాలంలో ప్రజలు అవలంబించిన కొన్ని రకాల ఆచారాలు పద్ధతులు తెర మీదికి వస్తు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే పురాతన కాలం నుంచి ప్రజలు అవలంబించిన కొన్ని ఆచారాలు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఎవరికి తెలియని కొన్ని పురాతన ఆచారాలు కొన్ని కొన్ని సార్లు పురాతన కట్టడాలలో బయటపడుతూ అందరికీ సరికొత్త అనుభూతిని ఇస్తుంటాయి  అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పెళ్లిళ్లలో  కట్నాలు చదివించడం ఎక్కడా కనిపించడం  కానీ అంతకు ముందు జనరేషన్ పెళ్లిళ్లలో  మాత్రం పెళ్లి జరిగింది అంటే భారీ రేంజ్లో పోటీపడి మరి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తరుపున  కట్నాలు చదివించేవారు.



 ఇక ఇలా పెళ్లికొడుకు పెళ్లికూతురు తరఫున కట్నాలు అందించిన అందరి పేర్లు కూడా పెద్దగా చెబుతూ ఉండేవారు. క్రమక్రమంగా ప్రస్తుతం అలాంటి ఆచారం కాస్త కనుమరుగైపోతుంది. అయితే కేవలం మనుషులకే కాదు దేవుళ్ళకు కట్నాలు  చెల్లించే పద్ధతి ఒకటి ఉంది అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఇటీవలే ఈ విషయం పురాతన ఆలయంలో బయటపడింది మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీరనలో ని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో తాజాగా ఓ రాతి శాసనం... భూదాన పత్రిక  శాసనం లో ఈ విషయం వెల్లడైంది.



 దేవుడి ఉత్సవాలకు కల్యాణ లకు కూడా ప్రజలందరూ పెద్ద మొత్తంలో కట్నాలు చెల్లించేవారు అనే విషయం ఇక్కడ లిఖించబడి ఉంది. ఇటీవలే తెలంగాణ జాగృతి చరిత్ర బృందం ప్రతినిధి పురాతత్వ పరిశోధకుడు అయిన రామోజు హరగోపాల్ ఆ ఆలయానికి వెళ్లిన సమయంలో అక్కడ లిఖించబడి ఉన్న కొన్ని శాసనాలను చదివి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఇటీవలే చరిత్రకారుడు కట్టా శ్రీనివాస్ ఆలయాన్ని సందర్శించినప్పుడు కూడా మరి కొన్ని విశేషాలు కూడా వెలుగులోకి వచ్చాయి. సీతారామ చంద్రస్వామి కల్యాణ లో 30 గ్రామాల ప్రజలు పాల్గొనే వారిని తమ ఇళ్లలో వివాహాలు జరిగితే అర్ధరూపాయి మగపెళ్ళివారు రూపాయి వంతున దేవుడికి కట్నం ఇచ్చేవారని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: