తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్  ప్రారంభించేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. తహసిల్దార్ వ్యవస్థను రద్దుచేసి ప్రజలందరికీ మరింత మెరుగైన సేవలు అందేవిధంగా ధరణి పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా ఎంతో సులభంగా ప్రజలందరూ సేవలు పొందే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ధరణి పోర్టల్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా దసరా పండుగ రోజున ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కానీ ధరణి పోర్టల్ లో  పలు సాంకేతిక సమస్యలు ఉన్న కారణంగా ధరణి పోర్టల్ ప్రారంభం కాస్త వాయిదా పడిన విషయం తెలిసిందే.



 అయితే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్ట తలపెట్టిన ధరణి పోర్టల్ నేడు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధరణి పోర్టల్ ను నేడు  ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో నేటి నుంచి ధరణి పోర్టల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ధరణి పోర్టల్ ప్రారంభించనున్నారు. అయితే రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడెప్పుడు  ధరణి పోర్టల్ అందుబాటులోకి వస్తుందని ఎదురు చూడగా నేడు వారి కోరిక కూడా తీరిపోయింది.



 ఇక ధరణి పోర్టల్ ప్రారంభం తో  ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో సులువుగా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉంది. అంతకుముందు వరకు ఎక్కడో దూరంలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ ఎంతో కష్టపడితూ  రోజుల తరబడి తిరిగేవారు. కానీ ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా కేవలం గంటల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో పాటు పాస్బుక్ కూడా చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ప్రజలందరికీ ఎంతో మెరుగైన సేవలు అందించే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ధరణి పోర్టల్ ద్వారా  భూమి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ముందుగా స్లాట్ బుక్ చేయించుకోవాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: