గత కొంత కాలంగా రాజకీయాల్లో సోషల్ మీడియా అనేది కాస్త కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సోషల్ మీడియాలో చేసే ప్రచారాలు ఇప్పుడు అధికార పార్టీ లను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అయితే అధికార పార్టీలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా మీద ఎక్కువగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని పార్టీలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వరకు కూడా వీక్ గా ఉంటున్నాయి అనే భావన వ్యక్తమవుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ సోషల్ మీడియా లో కాస్త బలంగానే ఉన్నా సరే కొన్ని కొన్ని పరిణామాలు మాత్రం పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి.

సోషల్ మీడియాలో ఉన్న కొన్ని వర్గాలు కార్యకర్తలను పార్టీకి దూరం చేస్తున్నాయి అనే భావన వ్యక్తమవుతోంది. దీనిపై ఇప్పుడు అధికార పార్టీ సోషల్ మీడియా మీద కాస్త ఫోకస్ చేసింది. సీఎం జగన్ కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఒక నేత సోషల్ మీడియా బాధ్యతలను కాస్త జాగ్రత్తగా చూస్తున్నారు. అయితే భవిష్యత్తు విషయంలో సిఎం జగన్ కాస్త జాగ్రత్త పడుతున్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కార్యకర్తలతో పాటు కొన్ని సామాజిక వర్గాలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని అందుకే వర్గాలు లేకుండా చేయడం మంచిది అనే భావన సీఎం జగన్ లో వ్యక్తమవుతోందని అంటున్నారు.

త్వరలోనే దీనికి సంబంధించి ఆయన ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సోషల్ మీడియా విషయంలో ఒక ఇద్దరు మంత్రులకు ఇప్పుడు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తుంది. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విధంగా ఇప్పుడు అధికార పార్టీ నేతలు కష్టపడలేకపోతున్నారు అనే భావన వ్యక్తమవుతోంది. దీనితోనే సీఎం జగన్ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారట. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: