తిరుపతి ఉప ఎన్నిక విషయంలో సీఎం జగన్ కాస్త ఎక్కువగానే ఫోకస్ పెట్టారు. కరోనాతో బల్లి దుర్గాప్రసాద్ మరణించిన తర్వాత అక్కడ ఎవరు పోటీ చేస్తారు ఏంటి అనే దానిపై అసలు ఎలాంటి స్పష్టత కూడా రావడం లేదు. సీఎం జగన్ చాలా వరకు కూడా ఈ ఉప ఎన్నికల్లో సీరియస్ గా తీసుకుని పార్టీ నేతలకు కూడా కొన్ని కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ నేతలు మాత్రం కొంతమంది అసలు తిరుపతి ఉప ఎన్నిక మీద ఫోకస్  చేయటం లేదు అని ఫిర్యాదులు కూడా సీఎం జగన్ వద్దకు వచ్చాయి.

దీంతో ఇప్పుడు సీఎం జగన్ కొంత మంది నేతలను తప్పించి మరికొంతమందికి తిరుపతి ఉప ఎన్నికల విషయంలో బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. బీహార్ ఎన్నికలు అయిన తర్వాత తిరుపతి ఉప ఎన్నిక విషయంలో నిర్ణయం తీసుకునే సూచనలు కనబడుతున్నాయి. దీనితో సీఎం జగన్ ఇప్పుడు ఈ ఎన్నిక మీద ఎక్కువగా దృష్టి పెట్టారని రాజకీయవర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఈ ఎన్నికకు అభ్యర్థిని కూడా ప్రకటించి అవకాశం ఉందని అంటున్నారు. అయితే అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలి ఏంటి అనేది స్పష్టత లేకపోయినా దాదాపుగా ఒక ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేరు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

దీనిపై ఇప్పటికే పార్టీ నేతల అభిప్రాయం కూడా సీఎం జగన్ తీసుకున్నారని సమాచారం. ఆయన కూడా పోటీ చేయడానికి అంగీకారం తెలిపారని దీనితోనే ఆయనను ముందుకు నడిపించే విధంగా సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ఎప్పుడు ప్రకటిస్తారు ఏంటి అనేది తెలియకపోయినా దాదాపుగా నవంబర్ మూడో వారంలో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కచ్చితంగా ఆయన పోటీ చేస్తే విజయం సాధిస్తాం అనే భావనలో కూడా పార్టీ అధిష్టానం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: