తెలంగాణ లో సరైన ప్రతిపక్షం లేదని తెలంగాణ వచ్చినప్పటినుంచి వినిపిస్తున్న మాట.. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో రేపో మాపో ఉన్నట్లు కనిపిస్తుంది.. ఎందుకంటే ఆ పార్టీ లో సరైన నాయకుడు లేదు.. ఉన్నా సీనియర్ ల డామినేషన్ తో వారు కనుమరుగైపోతున్నారు.. దాంతో సహజంగా కాంగ్రెస్ బలహీనముగ మారిపోయింది.. అయితే అధికార పార్టీ ఈ విషయంలో చాలా డిఫరెంట్ గా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత తిరుగులేని శక్తిగా ఎదిగింది టి.ఆర్.ఎస్ పార్టీ..మొదటినుంచి తెలంగాణా ప్రజలకు గులాబీ పార్టీ  విధేయతగా ఉంటు వస్తుంది..అందుకే ప్రజలు పార్టీ ను గెలిపిస్తూ వస్తున్నారు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు..

దుబ్బాక లో గులాబీ దండు విజయం సాధించడం ఖాయమనై చెప్తున్నారు.. వాస్తవానికి ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ కి గతంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది.. ఎప్పుడు ఓడిపోకపోగా భారీ మెజారిటీ తో విజయం సాధించింది. దుబ్బాక లో కూడా అదే చరిత్ర రిపీట్ అవుతుందని గులాబీ నేతలు అభిప్రాపపడుతున్నారు.. అయితే ఇక్కడ తెరాస గెలుపు ఖాయమని తెలిసిపోతున్నా ప్రతిపక్షాల మధ్య పోరు భీకరంగా ఉండబోతుందని తెలుస్తుంది.. ఎందుకంటే సరైన ప్రతిపక్షము లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ఆ స్థానానికి వస్తుందా అన్న అనుమానాలు వస్తున్నాయి..

నవంబర్ మూడో తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో గెలిచే బాధ్యత ను కేసీఆర్ హరీష్ రావు కి అప్పగించగా నోటిడికేషన్ రాకముందునుంచే హరీష్ రావు ఈ నియోజకవర్గంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు.. తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలా అయన చెమటోడ్చుతున్నారు.. అయితే హరీష్ రావు ఇక్కడ ఇంతలా కష్టపడిపోవడానికి కారణం లేకపోలేదు.. గత ఆరేళ్లుగా పార్టీ మంచి పరిపాలన కొనసాగిస్తూ ఉండగా, ఇటీవలే కాలంలో వచ్చిన విమర్శలు ఎప్పుడు రాలేదు.. ఇలాంటి టైం లో గెలిచి పార్టీ సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: