ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక ఎన్నికల విషయం బర్నింగ్ అంశం గా మారుతున్న సంగతి తెలిసిందే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైసీపీ ప్రభుత్వానికి ఎడ్డం అంటే తెడ్డం అనే రీతిలో వ్యవహరిస్తున్నారు.. స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నప్పుడు వద్దన్నాడు.. ఇప్పుడు వద్దు అంటుంటే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అంటున్నారు.. ఈ వ్యవహారం అధికార పార్టీ కి కొంత తలనొప్పి గా తయారవుతుంది.గతంలో కూడా ఇదే తరహాలో నిమ్మగడ్డ వ్యవహరించి కోర్టు దాక వెళ్ళాడు.. అయితే అక్కడ కోర్టు నిమ్మగడ్డ కు బుద్ధి చెప్పింది అనుకోండి.. ప్రభుత్వం చెప్పినట్లు విని ప్రభుత్వానికి సహకరిస్తూ పనులు చేయాలనీ చెప్పింది..  

ప్రతిపక్షాలతో కుమ్మక్కయి అధికార పార్టీ ని దెబ్బతీయాలని నిమ్మగడ్డ ఇలా చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.. అయితే ఇటీవలే రాష్ట్రంలోని అన్ని పార్టీ లతో సమావేశం నిర్వహించాలని నిమ్మగడ్డ చెప్పారు.. అందులో భాగంగానే  వివిధ రాజకీయ పక్షాలతో స‌మావేశం అయ్యారు. కరోనా భయంతో ఆయా పార్టీల‌తో నిమ్మ‌గ‌డ్డ విడివిడిగా భేటీ అయ్యారు. దీంతో భేటీలే విడివిడిగా జరుపుతుంటే ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

సంప్రదాయాలకు భిన్నంగా, దేశంలో ఎక్కడాలేని విధంగా వింత పోకడ అవలంబిస్తున్న తీరుపై రాజకీయ వర్గాలు విస్తుపోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నవంబర్ లో నిర్వహించే పరిస్థితి లేదని ప‌లువురు మంత్రులు స‌హా.. ప్ర‌జ‌లు కూడా అదే భావ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. టీడీపీ అయితే నిమ్మగడ్డ అన్నదానికి సై అంటుంది అని మొదటినుంచి వస్తున్నవార్తలు.. బీజేపీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.. సీపీఎం కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించే ప‌రిస్థితులు ఉన్నాయా..? లేదా..? అనేది ప్ర‌భుత్వంతో చ‌ర్చించిన త‌ర్వాతే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని సూచిస్తోంది.  ఇక వైసీపీ అయితే ఈ సమావేశాన్ని హాజరు కాదని చెప్పేసింది.. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ స్థానిక ఎన్నికల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: