మాములుగా పాములు పగ పడతాయని అంటారు. కానీ కోడ్లు కూడా పగ పడాతాయా.. అనే ఆలోచనలో అందరికీ కలుగుతాయి.. అవును మీరు విన్నది నిజమే.. కోడి పగ పట్టింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసింది చివరికి ప్రతాపాన్ని చూపించింది.. మనుషులే కాదు.. మూగ జీవులు కూడా పగ పడతాయని ఈ ఘటన ను చూసుకుంటే తెలుస్తుంది. ఏకంగా చంపేసి తన పగను తీర్చుకుంది.



వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఫిలిప్పీన్స్‌లో వెలుగు చూసింది.. మన దేశంలోనే కాదు..పాశ్చాత్య దేశాల లో కూడా ఈ మధ్య కోడి పందాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో ఓ కోడి పోలీసు అధికారి పై పగ తీర్చుకున్నాడు.ప్రొవెన్షియల్ పోలీస్ చీఫ్ కాలోనెల్ ఆర్నెల్ అపౌడ్ తన టీమ్‌తో అక్కడికి చేరుకున్నారు. కోళ్ల పందాల నిర్వాహకులపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఓ కోడి పుంజు అపౌడ్ మీదకు దూసుకొచ్చింది. ఆయనపై దాడి చేసి గాయపరిచింది... ఆ కోడి కాలికి కట్టిన విషపూరిత కత్తి వల్ల అతని తొడను చీల్సేసింది.. అతనికి రక్తం భారీగా కారింది.



అతన్ని ఆసుపత్రికి తరలించే లోపు అతను ప్రాణాలను విడిచాడు..ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ఎప్పుడు లేని విధంగా ఇలా జరగడం వల్ల ఆ ప్రాంతంలో చర్చలకు దారితీసింది. ఆ దేశంలో రెండు రకాలుగా కోడి పందాలు జరుగుతాయి. వారానికి ఒకసారి పోలీసుల అనుమతితో అధికారికంగా పోటీలు జరుగుతాయి. కొందరు మిగతా రోజుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కోడి కాళ్లకు కత్తులు కట్టి మరీ పోటీలు నిర్వహిస్తారు.పోటీలో ఉన్న వేరే కోడి చనిపోతే మిగితా కోడి గెలిచినట్లు లెక్క.. ఒక వైపు కరోనా ప్రభావం పెరుగుతున్న కూడా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ పందెలాను పూర్తిగా నిషేధించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: