ఒకసారి ఎప్పుడో హైదరాబాద్ దిల్ షుక్ నగర్ లో పేలుళ్లు సంభవిస్తేనే భారత దేశమంతా అల్లాడి పోయింది . అలాంటిది ముస్లిం దేశాలైన పాకిస్తాన్ మరియు ఆఫ్గనిస్తాన్ లో రోజుకొక పేలుడు జరుగుతుంటాయి అప్పుడు వాళ్ళకెలా ఉండాలి .. క్షణ క్షణం ఏ ప్రమాదం పొంచి ఉందొ అని బతకవలసి వస్తుంది కదా.. పేలుళ్లు వాళ్ళ దృష్టిలో టపాకాయలు పేల్చడం అనుకుంటున్నట్లు ఉన్నారు . టపాకాయలు అంటే ప్రాణనష్టం తక్కువే ఉంటుంది.  కానీ బాంబు పేలుళ్లు అంటే ప్రాణ నష్టం చాలా ఎక్కువ  ఉంటుంది .అభం శుభం తెలియని చిన్న పిల్లలు మరియు యువతీ యువకులు పెద్ద వారు మరణిస్తూ ఉంటారు .వాళ్ళు అంతటితో ఆగకుండా మరల ఎప్పుడైనా బాంబ్ పేలుళ్లు జరుపుతూ మేము  ఉన్నాము అని సంకేతాలు ఇస్తారు

ఆఫ్ఘనిస్థాన్‌ దేశంలోని  ఈరోజు  ఉదయం మందుపాతర పేలుడు  జరిగింది ఈ ఘటనలో నలుగురు పౌరులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
 
ముస్లిం దేశమైన ఆప్ఘనిస్థాన్ లో  ఈ నెల 23 నుంచి 27వతేదీ వరకు కేవలం ఐదు రోజుల్లో వరుసగా రోజు తప్పించి రోజు పేలుళ్లు సంభవిస్తూనే ఉన్నాయి దాదాపు ఈ వారంలో  జరిగిన జరిగిన ఐదు పేలుళ్లలో 58 మంది మరణించగా, మరో 123 మంది తీవ్రంగా గాయపడ్డారు.. అంతేగాక  కాబూల్, ఖోస్ట్ లలో జరిగిన పేలుళ్లలో 30 మందికి పైగా మరణించగా, మరో 77 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం నాడు జరిగిన మరో పేలుడులో ఐదుగురు పౌరులు మరణించగా, 33 మంది గాయపడ్డారు.

అయితే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో జరిగిన పేలుళ్లలో 58  మంది మరణించగా అందులో 30 మంది పిల్లలే ఉన్నట్లు  మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. అయితే ఆప్ఘనిస్థాన్ దేశంలో పేలుళ్లకు పాల్పడుతూ మానవ హక్కులను నాశనం చేస్తున్నారని . ప్రభుత్వ వ్యతిరేక ఉగ్రవాదులే ఈ పేలుళ్లకు కారణమని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: