ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ స్వర్గీయులయ్యారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ రోజు ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. వైద్యులు చికిత్స అందించినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు.

జునాగద్ జిల్లాలోని విశవదార్ పట్టణంలో కేశుభాయ్ పటేల్ జులై 24,1928లో జన్మించారు. ఆర్ఎస్ఎస్ ప్రచార కార్యకర్తగా సాగిన ఆయ పయనం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగింది. 1960లో జనసంఘ్ పార్టీ  కార్యకర్తగా తన రాజకీయానికి అడుగులు వేశారు. 1977లో రాజ్ కోట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జనసంఘ్ పార్టీలో రాజీనామా చేసి జనతా మోర్చా ప్రభుత్వంలో చేరారు. 1978-80 వరకు వ్యవసాయ మంత్రిగా చేసి 1995లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా కొనసాగుతూ 2001లో ఆ పదివికి రాజీనామా చేశారు. అనారోగ్యం కారణంగా రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: