నిమ్మగడ్డ రమేష్ వర్సెస్ అంబటి రాంబాబు.... ఈ పేర్లు వినగానే విషయం ఏంటో అందరికీ అర్థమయ్యే ఉంటుంది...  అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘానికి మరియు అధికార పక్షానికి మధ్య జరిగిన పోరు మర్చి పోయేది కాదు మరి. స్థానిక ఎన్నికల గురించి నిమ్మగడ్డ రమేష్ కు... ఏపీ సర్కార్ కు మధ్య జరిగిన ఎపిసోడ్ అలాంటిది. స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం మరియు ఉద్దేశం ఏంటో ముందుగా తెలుసుకోకుండా.. ఎన్నికల విషయంపై రాజకీయ పార్టీల అభిప్రాయాల్ని కోరిన తీరుపై ఏపీ సర్కారు బాగా వేడెక్కి ఉంది. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  అంబటి రాంబాబు....సంచలన వ్యాఖ్యలు చేస్తూ మండిపడ్డారు.

నిమ్మగడ్డ రమేష్ గారు ఏనాడో చంద్రబాబు వసమైపోయారని  అని.... అయినా ఏపీలో ఉన్నది ఎన్నికల కమిషన కాదని.. చంద్రబాబు - నిమ్మగడ్డ కమిషన్ అని కౌంటర్ విసిరారు. అఖిలపక్ష భేటీకి అధికారపక్షం హాజరు కాలేదన్న ప్రెస్ నోట్ చూసి నేను ఆశ్చర్యపోయినట్లుగా నిమ్మగడ్డ చెప్పడం.. ఏపీ అధికారపక్షానికి మరింత చిరాకు తెప్పించిందని...... అయినా ఏదో కొత్త విషయంలా దాన్ని అంత నొక్కి చెప్పాల్సిన అవసరం లేదంటూ... నిజానికి రాష్ట్ర ఎన్నికల సంఘం... అన్ని రాజకీయ పార్టీలను పిలిచి స్థానిక ఎన్నికలపై అభిప్రాయాలు తీసుకుంటున్న అంశంపై తాము ముందే హాజరు కామని స్పష్టం చేశామని.... మరి అలాంటప్పుడు నిమ్మగడ్డ అంతగా ఆశ్చర్యపోవడం లో మతలబు ఏంటంటూ మండిపడ్డారు.

అంతేకాదు రాజ్యాంగ పరంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని నిమ్మగడ్డ రమేశ్ టీడీపీకి తాకట్టు పెట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి. అయినా నిమ్మగడ్డ రమేష్ వ్యవహార శైలి పరిశీలిస్తే. అసలు విషయం ఏమిటో అందరికీ అర్థం అవుతుందన్నారు. నాడు ఒకట్రెండు కరోనా కేసులు ఉంటే ఎన్నికల్ని వాయిదా వేశారు. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో రోజుకు మూడు వేల కేసులు వస్తున్న తరుణంలో  ఇప్పుడు  ఎలా సాధ్యం? అందుకు నిమ్మగడ్డ ఎలా ఆమోదిస్తారు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఆదేశంతో టీడీపీ ఆఫీసులో తయారైన లేఖపై సంతకం చేసిందెవరు? ఆనాడు చంద్రన్న రాసిన లేఖపై సంతోషంగా సంతకం చేసిన నిమ్మగడ్డ.. నాడు రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేదు? దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి? అంటూ నిలదీశారు....

ఎన్నికల్లో మద్యం.. డబ్బు పంపిణీ  ని అరికట్టటానికి జగన్ ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకొస్తే దానిపై ఎన్నేసి మాటలుఅన్నారో .. వాటిని ఎలా విమర్శించారో మర్చిపోయారా? అంటూ గుర్తు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండూ కాదు చాలానే ఉన్నాయి. కానీ జగనన్న ప్రభుత్వం ఎప్పుడు ప్రజల అభివృద్ధిపైనే తన దృష్టిని కేంద్రీకరించి ఉంటుంది కనుకనే ఇటువంటి వాటిని పెద్దగా పట్టించుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు ఫైర్ బ్రాండ్ అంబటి .

మరింత సమాచారం తెలుసుకోండి: