కరోనా. ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో అన్ని విధాలుగా రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి. కరోనా పేరు చెప్పి మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేసినపుడు ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలు, పదవులే వైసీపీకి ముఖ్యమా అని ఇదే టీడీపీ పెద్దలు గద్దించారు. ఇపుడు మాత్రం రోజుకు మూడు వేల కరోనా కేసులు వస్తూంటే ఎన్నికలు పెట్టమని తొడగొడుతోంది కూడా ఇదే తెలుగుదేశం పార్టీ. అంటే కరోనా ఎంతలా రాజకీయ సరుకు అయిపోయిందో అర్ధమవుతోందిగా.

ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికల మీద తాజాగా అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వన్ టు వన్ గా సాగింది. అంటే ఒకరి తరువాత మరొక పార్టీ ప్రతినిధిని పిలిపించి ఆయన మాట్లాడారు. దీని మీద వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఒక్కొక్కరికీ పదేసి నిముషాల టైం ఇచ్చి విడివిడిగా మాట్లాడడం ఏంటి అని కూడా సంశయం వ్యక్తం చేశారు. దానికి మీడియా సమావేశంలో నిమ్మగడ్డ ఇచ్చిన సమాధానం చూస్తే వింతగానే ఉంది. కరోనా కారణంగానే అందరికీ ఒకేసారి సమావేశపరచి మీటింగ్ నిర్వహించలేకపోయామని చెప్పారు.

మరి ఒక పది మంది రాజకీయ పార్టీల ప్రతినిధులతో మీటింగ్ నిర్వహించడానికి కరోనా అడ్డు వస్తే ఏపీలో మూడు కోట్ల మంది ప్రజలు ఓటు వేయాలి. మరి వారికి ఓటేసేందుకు కరోనా భయాలు ఏవీ అక్కరలేదా అని వైసీపీ నేతలు అంటున్నారు. అంతే కాదు, కరోనా వేళ ఎన్నికల ఏర్పాట్లు ఎలా చేస్తారు. ఎన్నికల సిబ్బందికి ఎవరు కరోనా నుంచి రక్షణ కల్పిస్తారు. పొరపాటున ఎవరికైనా కరోనా వస్తే దానికి బాధ్యులెవరు అని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి కరోనా పేరు అటూ ఇటూ చెప్పి భలేగా ఆటాడుకుంటున్నారు అంటున్నారు. ఇదంతా సరే కానీ ఏపీలో కరోనా తగ్గితే చంద్రబాబు ఇంకా హైదరాబాద్ లోనే  ఎందుకు ఉన్నారో కదా. మరి ఆయన‌కు భయం ఉంటే ఓటేసే జనాలకు భయం ఉండనక్కరలేదా. ఇదంతా కరోనా ప్రశ్నలే. ఇవన్నీ కరోనా పాలిటిక్సే.

మరింత సమాచారం తెలుసుకోండి: