రోజు రోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలందరిలో భయాందోళనలు  నెలకొంటున్నాయి అన్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ బారినపడి ప్రాణాలు పోవడం ఏమో కానీ వైరస్ సోకుతుంది ఏమో అన్న భయంతో నే ఏకంగా ఎంతో మంది మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఎంతో ఉన్నత స్థానంలో ఉండి మంచి హోదాలో మంచి లోకజ్ఞానం ఉన్నవారు కూడా కొంచెం అయినా అవగాహన లేకుండా చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటనలు రోజు రోజుకు ప్రజలందరినీ ఆందోళనలో ముంచెత్తుతున్నాయి.



 ఎక్కడ ఇలాంటి ఘటన జరిగింది... కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికి ఎంతో మంది ప్రజలను కరోనా భయం వెంటాడుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ తో ఒక జడ్జి కన్నుమూశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ నజీర్ ఇటీవలే కరోనా వైరస్ బారిన పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు  ఆయన. ఆ తర్వాత చికిత్స తీసుకుని వైరస్ బారి నుంచి కోరుకున్నారు.



ఈ క్రమంలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వస్తారని కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనంద పడిపోయారు. ఈ క్రమంలోనే కరోనా వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వద్దాం అనుకుంటున్న తరుణంలో ప్లేట్లెట్స్ తగ్గిపోయి మళ్లీ అనారోగ్యానికి గురై మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి వెళ్లారు. చివరికి అక్కడ మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. అయితే కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇంటికి వస్తాడు అని ఆనందపడిన కుటుంబ సభ్యులకు అంతలోనే మరణవార్త వినిపించడంతో ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు కుటుంబసభ్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: