ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో కనీసం పర్యావరణాన్ని రక్షించాలని ఆలోచన ఎవరిలో ఉండటం లేదు. రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతూ ఉండటం సెల్ ఫోన్ వాడకం కూడా పెరుగుతూ ఉండటం... అడవులు నరికి వాటి ప్రాంతంలో నగరాలూ  ఏర్పాటు అవుతూ ఉండటం కారణంగా రోజురోజుకు పర్యావరణ కాలుష్యం పెరిగి పోతుంది తప్ప ఎక్కడా దాఖలాలు మాత్రం కనిపించడం లేదు అటు ప్రభుత్వాలు పర్యావరణ కాలుష్యం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే భవిష్యత్తు తరాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించినప్పటికీ కూడా... ఎవరు అంతగా పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచించరు.



 ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి రోజూ ప్రతి మనిషి చేతులారా పర్యావరణ కాలుష్యం చేస్తున్నాడు అని చెప్పాలి. రోజురోజుకు అడవులు కనుమరుగయ్యి  అడవులు ఉన్న ప్రాంతాలలో జనావాసాలు వెలసి ఎంతో కాలుష్యం జరుగుతుంది. ఇక ఈ కాలుష్యం కారణంగా ఎన్నో పక్షి జాతులు అంతరించి పోతున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ హీరోగా నటించిన రోబో 2.0 సినిమాలో చూపించిన విధంగానే కాలుష్యం కారణంగా  రోజు రోజుకి ఎన్నో రకాల పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. అంతేకాకుండా మునుపటిలా ప్రస్తుతం పక్షులు కనిపించడం లేదు.



 పక్షుల పరిమాణంలో కూడా ఎన్నో తేడాలు వస్తున్నాయి. తాజాగా ఓయూ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి వాతావరణ మార్పుల కారణంగా పక్షుల పరిమాణం ఎంతగానో తగ్గిపోతుంది అని మిషిగన్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల తేల్చిచెప్పారు. 40 ఏళ్ల కాలంలో 70 వేలకు పైగా కాలుష్యం కారణంగా మృతి చెందిన పక్షుల పై జరిపిన పరిశోధనల్లో  ఆసక్తికర విషయాలు వెల్లడించారు పరిశోధకులు తెలిపారు. వాతావరణంలో మార్పుల కారణంగా పక్షుల వలసలు పెరిగిపోతున్నాయని.. శరీరం చిన్నగా ఉంటేనే అవి సులువుగా ఎక్కువ దూరం ఎగర  కలుగుతాయని.. అందుకే రాను రాను పక్షుల పరిమాణం తగ్గిపోతుంది రెక్కల పరిమాణం పెరుగుతుంది అంటూ పరిశోధకులు గుర్తించినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: