మనిషి జీవితంలో నిద్ర అనేది ఒక భాగం అనే విషయం తెలిసిందే. సరైన నిద్ర లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. తప్పనిసరిగా ప్రతి రోజూ ఎనిమిది గంటలు పడుకోవాలి అని చెబుతూ ఉంటారు. అయితే నిద్ర లేకపోతే  ఆరోగ్య సమస్యలు వచ్చినట్లుగానే అతినిద్ర కారణంగా కూడా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. సాధారణం కంటే ఎక్కువగా నిద్ర పోయినప్పుడు మరిన్ని ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లు గా ఉంటుంది. అందుకే అతి గా నిద్ర పోకుండా తక్కువగా నిద్ర పోకుండా ప్రతిరోజు 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలని వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు ప్రజలకు హెచ్చరిస్తూనే ఉన్నారు. సాధారణంగా అయితే ఎవరైనా మహా అయితే ఎనిమిది గంటలు పడుకుంటారు... ఎక్కువగా అలసి పోయి ఉంటే 10 గంటలు  పడుకుంటారు.




 అంతేకానీ వారం రోజులు కనీసం నిద్ర లేకుండా పడుకోవడం అనేది వింటేనే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అలాంటిది  రెండు నెలలు పడుకోవడం అంటే ఒక్కసారిగా అవాక్కవుతారు అందరు. రెండు నెలల పాటు కనీసం స్నానం తిండితిప్పలు ఏమీ లేకుండా ఒకే చోట పడుకోవడం అనేది చాలా మంది తక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుంది కొంతమంది వ్యాధితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటుంది. క్లీన్ లేవిస్ సిండ్రోమ్  అనే వ్యాధితో బాధపడేవారు ఇలా రోజుల తరబడి పాడుకుంటూ ఉంటారు.



 వాళ్లకి పగలు రాత్రి అనే తేడా ఉండదు. ఈ సిండ్రోమ్ తో  బాధపడేవారికి ఒక్కొక్కసారి పది రోజులకు పైగా కూడా రాత్రింబవళ్లు నిద్ర పోయినప్పటికీ కూడా నిద్ర సరిపోద ట. దీనిని స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్  అని కూడా పిలుస్తారట. ఇలాంటి అరుదైన వ్యాధి నూటికో కోటికో ఎవరికో ఒకరికి వస్తూ  ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న వారిలో కొలంబియాకు చెందిన షారుక్ తోవర్  అనే యువతి ఉంది. సదరు యువతి ఏకంగా ఓ సారి రెండు నెలలకు పైగా ఏకధాటిగా నిద్ర పోయిందట. ఇక ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఆమె శరీరం లోకి ఆహారాన్ని అందించారు. అయితే ఇలాంటి అరుదైన వ్యాధి కి చికిత్స లేకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: