టీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ రోజు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. శాసనమండలి దర్బార్ హాలులో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకర కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

ఇటీవల జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించింది.  672 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. నియోజకవర్గంలో మొత్తం 823 ఓట్లు పోలవగా, మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే ఫలితం తేలిపోయింది. 88% వరకు ఓట్లు కల్వకుంట్ల కవితకే దక్కాయి. గత ఎన్నికల్లో ఎంపీగా భారీ పరాజయాన్ని చవిచూసిన ఎంపీ కవిత నిజామాబాద్ నియోజకవర్గంలో మళ్లీ ఎమ్మెల్సీగా గెలుపొంది.. భారీ మెజార్టీని దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: