ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గత కొద్దిరోజులుగా ఎర్రచందనంపై పోలీసులు నిఘా పెంచారు. అక్రమంగా ఎర్రచందనం దుంగలను రాష్ట్రం దాటిస్తున్న వారిపై కేసు నమోదు చేసి సరుకును సీజ్ చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. జిల్లా సమీపంలోని ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా  అక్రమంగా తరలిస్తున్న 194 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.3కోట్లు ఉంటుందని పోలీసులు  తెలిపారు. వీటిని అక్రమంగా తరలించే వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా నిందితులు పరారయ్యారని వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసి త్వరలో పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు. ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎవరైనా అక్రమంగా ఎర్రచందనం, మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరించారు. గట్టి నిఘా ఏర్పాటు చేశామని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: