రెవిడెసివిర్, ఫావిపిరవిర్ అనేవి యాంటీవైరల్ మందులు అన్న సంగతి తెలిసినదే. ఇక వీటిని కరోనా పాజిటివ్ బాధితులకు మందులుగా ఇస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు. ఇకపోతే వీటిని కరోనా వైరస్‌ చికిత్సకు మందులుగా పేర్కొనలేదని కేంద్రం తాజాగా ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో కొవిడ్‌-19 రోగులకు చికిత్స చేయడంలో ఈ మెడిసన్ సామర్థ్యం వైద్య నిపుణుల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రెవిడెసివిర్, ఫావిపిరవిర్ అనేవి యాంటీవైరల్ మందులు కొవిడ్-19 చికిత్సకు అనుమతి లేకుండా విరివిగా వాడుతున్నారని ఆరోపిస్తూ న్యాయవాది ఎంఎల్‌ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రం యెక్క సమాధానం కోరింది. ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై కేంద్రానికి నోటీసులు జారీ చేసి కేవలం 4 అంటే 4 వారాల్లో స్పందన తెలియజేయాలని కోరింది.

వివరాల్లోకి వెళితే... కొవిడ్ వ్యాక్సిన్ అని పేరు చెప్పి పలు రకాల మందుల అమ్మకాలు మార్కెట్లో జరుగుతున్నాయని, ఈ క్రమంలో రెవిడెసివిర్, ఫావిపిరవిర్ లాంటి ఎలాంటి అనుమతులు లేని మందులను కరోనా వ్యాక్సిన్‌గా మార్కెట్లో అమ్మకుండా ఆపాలని పిటిషనర్ ఎంఎల్‌ శర్మ సుప్రీం కోర్టును కోరారు. సరియైన లైసెన్సులు లేకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న దాదాపు 10 భారతీయ ఔషధాల తయారీ కంపెనీలు, కరోనా రోగుల చికిత్స కోసం సదరు ఔషధాలను తయారుచేసి అమ్మినందుకు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషనర్‌ ఉన్నత న్యాయాస్థానాన్ని కోరారు.

ఈ క్రమంలో రెమిడెసివిర్ కరోన రోగులపై ఎలాంటి ప్రభావం చూపలేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికను కోర్టుకు సమర్పించారు. కరోనా మందుల పేరుతో అమ్మకాలు జరుపుతున్న 10 ఫార్మా కంపెనీలపై విచారణ జరిపి తీరాలని పిటిషనర్‌ కోరారు. కాగా.. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 4 వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా రెవిడెసివిర్‌, ఫావిపిరవిర్‌లను కరోనా వైరస్‌ చికిత్సకు మందులుగా పేర్కొనలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: