ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ దుండగుడు చర్చిలోకి ప్రవేశించి ముగ్గుర్ని అతి కిరాతకంగా హతామార్చి చంపాడు. మహిళ తలను ఏకంగా కోసేసి విడదీసేశాడు. ఈ ఘటన ఉగ్రవాద చర్యగా నగర మేయర్ క్రిస్టియన్ ఎస్ట్రోసీ భావిస్తున్నారు. నీస్ నగరంలోని నోట్రే డామ్ చర్చి సమీపంలో కత్తితో దాడి జరిగి ఉంటుందని నగర మేయర్ పేర్కొన్నాడు.

ముగ్గురిని హతమార్చిన ఆ నిందితుడిని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి పట్టుకున్నారు. ఈ కత్తి దాడిలో ముగ్గురు చనిపోగా.. అనేక మంది గాయాలపాలయ్యారు. ఈ దాడిపై ఆ దేశ యాంటీ టెర్రరిస్ట్ ప్రొసిక్యూటర్ విచారణకు ఆదేశించారు. అయితే మహమ్మద్ ప్రవక్తపై అనుచిత రీతిలో కార్టూన్లు వేస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో పారిస్ వీధిలో కూడా ఓ వ్యక్తి తలను నరికివేశారు. యాంటీ ఇస్లామిక్ ఎంజెడాతో కొనసాగిస్తున్న అధ్యక్షడు మాక్రన్ కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఆందోళన చేపడుతున్న విషయం విధితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: