ఏంటి షాక్ తిన్నారా? మీరు విన్నది నిజమే. ఇది మగాళ్లకు బ్యాడ్ న్యూస్ మరి. ఇది మగ్గాళ్ళకు మాత్రేమే వచ్చే ఓ రకమైన జబ్బు. కేవలం మగ వారిని మాత్రమే ప్రభావితం చేస్తున్న కొత్త ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక దీన్ని ‘వెక్సాస్‌ సిండ్రోమ్‌’గా పిలుస్తున్నారు. అమెరికాలోని NIH (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌) లో భాగమైన NHGRI (నేషనల్‌ హ్యుమన్‌ జీనోమ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్), అలాగే ఇతర ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు ఈ కొత్త సిండ్రోమ్‌ను కనుగొన్నట్టు తెలుస్తోంది.

అయితే వారు దీన్ని ఎలా గుర్తించారు అనేదేగా మీ డౌట్.. దానికి వారు ఓ ప్రత్యేకమైన పద్ధతి పాటించారు. 2,500 మంది జన్యు శ్రేణులపై వారు అధ్యయనం చేయగా కొందరిలో యూబీఏ1 అనే జన్యువును గుర్తించారు. ఇది ఈ1 ఎంజైమ్, వాక్యూల్స్, ఎక్స్-లింక్డ్, సోమాటిక్ సిండ్రోమ్ (వెక్సాస్‌), ఆటో ఇన్‌ఫ్లమేటరీ, అనే ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌కు కారణమవుతుందని తేల్చి చెప్పారు. ఇది అరుదైన, హానికలిగించే జన్యువని చెబుతున్నారు.

ఇకపోతే, అన్ని జన్యువులు 2 కాపీలుంటే ఇది మాత్రం ఒక్కటంటే ఒక్కటే ఉందని, అది కూడా ఎక్స్‌ క్రోమోజోమ్‌లో ఉంటోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన మిస్టర్ డేనియల్‌ కాస్ట్నర్‌ తెలిపారు. మగవారిలో ఒక ఎక్స్‌ క్రోమోజోమ్‌, ఒక వై క్రోమోజోమ్‌ ఉంటుందని మనకు తెలిసినదే. అయితే ఇది కేవలం ఎక్స్‌ క్రోమోజోమ్‌ కలిగి ఉన్న పురుషుల్లోనే కన్పిస్తున్నదని ఆయన చెప్పడం గమనార్హం. కాగా ఈ జన్యువు మ్యుటేషన్‌ అతి ప్రమాదకర ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌కు దారితీస్తుందని తెలిపారు.

ఇకపోతే, వెక్సాస్‌ సిండ్రోమ్‌ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. తరచూ జ్వరం రావడం, సిరల్లో రక్తం గడ్డకట్టడం, ఊపరితిత్తుల సంబంధిత వ్యాధులు, మైలోయిడ్ కణాల్లో వాక్యూల్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ విషయాలు 'న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్'‌లో తాజాగా ప్రచురితమయ్యాయి. ప్రపంచమంతా కరోనాతో తలకిందులైనవేళ ఇపుడు మరో చేదు వార్త వినిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: