ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్స్ రీ ఓపెన్ చేసే విషయంలో చాలా దూకుడుగా ఉంది. నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు ఓపెన్ చేస్తామని స్పష్టం చేసింది. పటిష్టంగా కోవిడ్‌ రక్షణ చర్యలు ఉంటాయి అని పేర్కొంది. రోజువిడిచి రోజు పాఠశాలల్లో తరగతులు ఉంటాయని ఆదేశాలు జారీ చేసింది. ఒంటిపూట బళ్లు నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 2 నుంచి తిరిగి పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోనున్నాయని... పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడిపిస్తామని పేర్కొంది ఏపీ సరార్.

 ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్ లో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్‌ వ్యాపించకుండా అన్నరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ ను నేడు తెలిపారు. నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయని, నవంబర్‌ 2 నుంచి 9, 10, 11 అలాగే ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ,12 / ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు అని పేర్కొన్నారు. హాఫ్‌ డే మాత్రం నిర్వహిస్తారు అని ఆమె తెలిపారు.

హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్‌ 2 నుంచే తరగతులు ప్రారంభిస్తారు అని స్పష్టం చేసారు. రొటేషన్‌ పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారు అని ఆమె వివరించారు. నవంబర్‌ 23 నుంచి 6, 7, 8  క్లాసులకు బోధన ప్రారంభం అవుతుంది. రోజు విడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారని అన్నారు. డిసెంబర్‌ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రోజు విడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు అని చెప్పారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలకు అన్నింటికీ కూడా ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుంది అన్నారు. అయితే నవంబర్ 30 వరకు స్కూల్స్ వద్దని కేంద్రం చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: