ఉగ్రవాదానికి పుట్టినిల్లు అయిన పాకిస్తాన్ ఎప్పుడూ భారత్ పై  ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నాలు  చేస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఎన్నో  దశాబ్దాల నుంచి పాకిస్థాన్ అలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ భారత్  ఎప్పటికప్పుడు పాకిస్తాన్ను చావుదెబ్బ కొడుతూనే ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులతో భారత్లో విధ్వంసం సృష్టించాలని పాకిస్థాన్ చేయని ప్రయత్నాలు లేవు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే భారత్ ఈ విషయంలో పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరే రోజు రోజుకు పాకిస్తాన్ను మరింత ఇబ్బందులు పెడుతుంది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం భారత వ్యూహాల ముందు పాకిస్తాన్ మోకరిల్లుతుంది.



 భారత దౌత్య పరంగా వ్యూహాత్మ  కంగా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకు అయోమయంగా మారిపోతుంది. ఇప్పటికే పాకిస్తాన్ ఏ చిన్న తోక జోడింపు చర్యకు  పాల్పడిన అంతకు మించి అనే విధంగా చావుదెబ్బ కొడుతుంది భారత్ . భారత్ పై  దాడి చేయాలి అనే ఆలోచన వస్తేనే  పాకిస్తాన్ వనికి పోయే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో మొన్నటివరకు పాకిస్తాన్ కి సహాయం చేస్తూ ఉన్న మరికొన్ని దేశాలు కూడా పాకిస్తాన్ ను  పూర్తిగా నిషేధించే విధంగా ప్రస్తుతం వ్యూహాత్మకంగా దౌత్య పరంగా ముందుకు వెళ్తుంది భారత్.




ఈ క్రమంలోనే ఏకంగా పాకిస్తాన్ మిత్ర దేశాల  ఇరాన్ సౌదీ దేశాలు పాకిస్తాన్ కి భారీ షాక్ ఇచ్చాయి . ప్రస్తుతం ఇరాన్ సౌదీ అరేబియా దేశాలు భారత్ కు మిత్ర దేశాల కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ భారత దేశానికి వ్యతిరేకంగా చేసే ఏ కార్యక్రమాన్ని కూడా అనుమతించే ప్రసక్తే లేదు అంటూ ఇరాన్ సౌదీ అరేబియా దేశాలు స్పష్టం చేశాయి. ఇది ఒక రకంగా భారతదేశ దౌత్యపరమైన విజయమని అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. పాక్ అసమర్థత అని కూడా చెబుతున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: