ప్రస్తుతం చైనా విస్తరణ వాదం పుణ్యమా అని ప్రపంచదేశాలు చైనాకు శత్రువులు గా  మారిపోతున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ టర్కీ నేపాల్ ఇరాక్  లాంటి దేశాల మినహా మిగతా అన్ని ప్రపంచ దేశాలు  ప్రస్తుతం చైనాను  ఒక శత్రువు దేశంగా నే భావిస్తున్నట్లు తెలుస్తోంది  ముఖ్యంగా చైనా సరిహద్దుల చుట్టూ ఉన్న 14 దేశాలు ప్రస్తుతం చైనాను బద్ధశత్రువుగా నే చూస్తున్నాయి. చైనా ఎన్నిసార్లు ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నించినప్పటికీ చైనాను తిప్పి కొడుతూనే ఉన్నాయి.



 అయితే చైనా విస్తరణ వాద ధోరణి తో ఏకంగా  జపాన్ తో కూడా కయ్యానికి కాలు దువ్విన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి జపాన్ పాలనలో ఉన్న కొన్ని దీవులను తమదేనంటూ చైనా ఆరోపణలు చేయడం... దీనికి జపాన్ ఎంతో సమర్థవంతంగా తిప్పికొట్టడం లాంటిది  కూడా జరిగింది. ఈ క్రమంలో నే జపాన్ చైనా మధ్య వివాదం ఏర్పడింది. దీంతో ప్రస్తుతం చైనా కి షాక్ ఇచ్చేందుకు జపాన్ కూడా సిద్ధమైంది అనే విషయం తెలిసిందే. ఏ సముద్ర జలాలపై చైనా ఆధిపత్యం సాధించాలని అనుకుందో  అదే సముద్ర జలాలలో ప్రస్తుతం జపాన్ దీటుగా నిలబడింది. దీంతో చైనా కి భారీ షాక్ తగిలింది.



 ఏకంగా 46 వేల మంది సైన్యం తో అమెరికా జపాన్ రెండు దేశాలు కలిసి యుద్ధ విన్యాసాలు ప్రారంభించాయి. చైనా సముద్ర జలాలపై ఆధిపత్యం సంపాదించాలనుకున్న ప్రాంతంలోనే ప్రస్తుతం అమెరికాలో జపాన్ దేశాలు  సంయుక్తంగా విన్యాసాలు ప్రారంభిస్తున్నాయి. అయితే ఒక రకంగా జపాన్ చైనా కు వార్నింగ్ ఇవ్వడానికి ఇలాంటి తరహా విన్యాసాలు చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే చైనా ఏమాత్రం దుందుడుకుగా  వ్యవహరించిన సరైన బుద్ధి చెప్పడానికి జపాన్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంది అని విన్యాసాలతో  జపాన్ చైనా కు చెప్పకనే చెప్పింది అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: