మొన్నటి వరకు పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ మత రాజ్య స్థాపన లక్ష్యంగా ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తూ ఉండేది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వ్యవహరించే తీరు పై ప్రపంచ దేశాలు మొత్తం తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉండేది. అందుకే పాకిస్తాన్ కి సహాయం చేసేందుకు చాలా తక్కువ దేశాలు ముందుకు వస్తూ ఉండేవి. అయితే నేటి రోజుల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. రానున్న రోజుల్లో పాకిస్థాన్ కంటే ఎక్కువగా టర్కీ మారబోతుంది అన్నది అర్ధమవుతుంది. మత రాజ్య స్థాపన లక్ష్యంగా విచ్చలవిడిగా వ్యవహరిస్తుంది టర్కీ.  ఈ క్రమంలోనే ఇదంతా గమనిస్తున్న ప్రపంచ దేశాలు టర్కీ కీ  క్రమక్రమంగా బ్రేక్ వేస్తూ వస్తున్నాయి.



 ఇటీవల ఇస్లామిక్ దేశాలపై  ఆధిపత్యం సంపాదించాలి  అనుకుంటున్న టర్కీ  ఆ తరహా వ్యూహాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఫ్రాన్స్  తో కూడా సరికొత్త వివాదానికి తెరలేపింది. ఇటీవలే ఫ్రాన్స్ అధ్యక్షుడు పై టర్కీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ సరికొత్త వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. ఇలా మత రాజ్య స్థాపన కోసం మత రాజ్యలన్నింటికీ నాయకుడిగా తయారవడం కోసం ఎన్నో రకాల నీచమైన వ్యూహాలను  అమలుచేస్తోంది టర్కీ.



 ఇలాంటి క్రమంలోనే ప్రపంచ దేశాలు ఇప్పుడు వరకు చేస్తున్న సహాయాన్ని నిలిపివేస్తూ టర్కీ కీ భారీ షాక్ ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల నుంచి వరుసగా ఆంక్షలు ప్రారంభమయ్యాయి. ఇటీవలే అజర్బైజాన్ ఆర్మేనియా యుద్ధం నేపథ్యంలో టర్కీ వ్యవహరించిన తీరుపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి టర్కీ కి భారీ షాక్ తగిలింది. ఇటీవలే కెనడా టర్కీ  విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వరకు పలు రకాల ఇంజిన్లను టర్కీకి  ఎగుమతి చేసేది కెనడా కానీ ప్రస్తుతం ఎగుమతి చేయబోము  అంటూ కెనడా కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం మత రాజ్య స్థాపన లక్ష్యంగా గాంభీర్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న టర్కీ కి భారీ షాక్ తగిలింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: