ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల విషయంలో ఇప్పుడు కాస్త వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇళ్ళ పట్టాల విషయంలో ఏపీ సర్కార్ ముందుకి వెళ్ళాలి అని భావించినా సరే అందుకు అనుగుణంగా పరిస్థితి లేదు అనే చెప్పాలి. రాజకీయంగా దీనిపై విపక్షాల మధ్య అధికార పార్టీ మధ్య తీవ్ర వివాదం నడుస్తుంది. ఇక తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. సంక్రాంతి లోగా టిట్కో ఇల్లు ఇవ్వకపోతే  స్వాధీనం చేసుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

పేదలకు ఇళ్ళు ఇద్దామని అనుకుంటే కొన్ని దుష్ట శక్తులు కోర్ట్ కి వెళ్లి అడ్డుకున్నాయి అని ఆయన మండిపడ్డారు. అర్హులకి 300 స్క్వేర్ ఫీట్ ఇళ్లను ఉచితంగానే ఇస్తాం అని ఆయన స్పష్టం చేసారు. టీడీపీ హయాంలో కేవలం టిట్కో ఇల్లు 81 వేల ఇల్లు మాత్రమే 90 శాతం పూర్తి చేసారు అని ఆయన చెప్పుకొచ్చారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి అని మంత్రి అన్నారు. టిడిపి గురించి మాట్లాడడం అనవసరం అని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు ను జగన్ ప్రారంభిస్తారు అని ఆయన స్పష్టం చేసారు.

నిర్ధేశించిన సమయంలో లోగే ప్రోజెక్టు పూర్తి చేస్తాం అని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అదే విధంగా చంద్రబాబు టార్గెట్ గా మరిన్ని విమర్శలు చేసారు. కమీషన్ల కోసం  చంద్రబాబు కక్కుర్తి పడ్డారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు  తగ్గించడం పై కేంద్రాన్ని ఒప్పిస్తాం అని ధీమా వ్యక్తం చేసారు. అవసరం అయితే న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తాము అని ఆయన అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పోలవరం   ప్రాజెక్టు ఎంత శాతం పూర్తి అయిందో ఆ వివరాలు నాకు తెలియదు అని అన్నారు. తెలుసుకొని రేపు చెబుతాను అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: