రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలని భావిస్తున్న సిఎం కేసీఆర్ తాజాగా ధరణి పోర్టల్ ని లాంచ్ చేసారు. నేడు మధ్యాహ్నం ఆయన లాంచ్ చేసారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభం కంటే ముందు సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. మేడ్చ‌ల్ జిల్లా మూడుచింత‌ల‌ప‌ల్లిలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో సిఎం తో పాటుగా... ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు, మంత్రి మ‌ల్లారెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మోసాలకు ఆస్కారమే ఉండదు.. గందరగోళం అనే మాటే వినపడదు అని ఆయన అన్నారు.

 పక్కాగా.. పారదర్శకంగా.. సులువుగా స్లాట్‌ బుకింగ్‌.. వెరిఫికేషన్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ వరకు..అంతా ఆన్‌లైన్‌ లోనే అన్నారు. ప్రతి అంగుళం భద్రంగా నిక్షిప్తం అవుతుంది అని చెప్పారు. పది నిమిషాల్లోనే పట్టాదారు పాసుపుస్తకాలు.. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. భూమి వివరాలు తెలుసుకునే అవకాశం ఉందని అన్నారు. రెవెన్యూ చరిత్రలోనే నూతన అధ్యాయమైన ‘ధరణి’ అందుబాటులోకి వ‌చ్చిందని అన్నారు. ఇక దుబ్బాక ఎన్నికల గురించి మాట్లాడుతూ... దుబ్బాక ఎన్నికలు మాకు పెద్ద లెక్కే కాదు అన్నారు.

మంచి మెజారిటీతో గెలుస్తాం అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే గెలుపు ఖాయం అయిందని అన్నారు. రాబోయే 15 రోజుల్లో నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ లు ప్రారంభం  అవుతాయని అన్నారు. ప్రతి ఓపెన్ ప్లాట్ దారుడు నాన్ అగ్రికల్చర్ ఆస్తిగా నమోదు చేసుకోవాలి అని సూచించారు. పోర్టల్ లో ఉన్న ఒక ఫీచర్ ని ఆయన వివరించారు. ప్లాట్ ల వివరాలు వెబ్ సైట్ లో కనిపించొద్దు అనుకుంటే హైడ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అని చెప్పారు. పూర్తి టైటిల్ విషయం లో ఓనర్ నష్టపోతే ప్రభుత్వమే నష్ట పరిహారం ఇస్తది అని అన్నారు. ధరణి పోర్టల్ బ్యాకప్ సర్వర్లు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ప్రజల ముఖాల్లో చిరునవ్వే మనకు ముఖ్యం అన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ధరణి పోర్టల్ గురించి అడుగుతున్నారు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: