దుబ్బాకలో ఉపఎన్నికల ప్రచార హోరు జోరందుకుంది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కాక రేపుతోంది. దుబ్బాక బైపోల్ పై తొలిసారి స్పందించిన సీఎం కేసీఆర్.. అక్కడ మంచి మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా  వ్యక్తం చేశారు. మరోవైపు టీఆర్‌ఎస్‌, బీజేపీ  మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. భారీగా బలగాలను మోహరిస్తోంది.

దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిందన్నారు ముఖ్యమంత్రి  కేసీఆర్. ఎన్నికల వరకు అన్ని తతంగాలు నడుస్తుంటాయని ఆయన సెటైర్లు వేశారు. తమ పార్టీకి దుబ్బాకలో అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన చిట్ చాట్ లో చెప్పారు. దుబ్బాకలో తమ పార్టీ గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేవని ఆయన తేల్చి చెప్పారు.

నవంబర్ 3న  దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక కోసం ఇప్పటికే అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. దుబ్బాక అభివృద్ధి బాధ్యత జిల్లా మంత్రిగా తనదేనన్నారు మంత్రి హరీష్ రావు. దుబ్బాక నియోజక వర్గంలోని తొగుట మండలం ఘనాపూర్లో ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పాల్గొన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉచిత కరెంట్ ఇచ్చారా? అని ప్రశ్నించిన హరీష్‌రావు... ఓటు ద్వారా బీజేపీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్ ఫలితమే దుబ్బాకలో వస్తుందని జోస్యం చెప్పారు బండి సంజయ్.  పింఛన్లు విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.  బీజేపీని కాదు, ప్రజా స్వామ్యాన్ని గెలిపించండని ప్రజలకు పిలుపునిచ్చారు.  దుబ్బాక నియోజకవర్గం కాసులాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన... టీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు సంధించారు.

దుబ్బాక  బై ఎలక్షన్​ కోసం బారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది ఎలక్షన్ కమిషన్. మూడునాలుగు రోజుల కిందటే కలెక్టర్‌పై బదిలీ వేటు వేసింది. ఎన్నికల పరిశీలకుడిగా.. తమిళనాడుకు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్​ను నియమించింది. సీఆర్​పీఎఫ్​, పోలీస్​ బలగాలతో దుబ్బాక టౌన్​లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: