ఇన్ సైడర్ ట్రేడింగ్ లో టీడీపీ పాల్గొందని టీడీపీ నేతలు ఒప్పుకుంటున్నట్లు మాట్లాడుతున్నారు.. ఇక్కడ భూములు కొంటె తప్పేంది అన్నట్లు మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.. వాస్తవానికి ఇక్కడ రాజధాని రాకముందు టీడీపీ నేతలు తమ బినామీల పేర్లతో వందల ఎకరాలు భారీగా భూములు కొనుగోలు చేసి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని వెలుగులోకి వచ్చింది. దాంతో జగన్ ప్రభుత్వం దీనిపై ఆరా తీసే ప్రయత్నం చేయగా చంద్రబాబు అండ్ కో ఈ విచారణ ను అడ్డుకుంది.. కోర్టు ద్వారా ఈ విచారణ ను నిలిపివేసేలా చేసింది..

అక్కడితో ఆగకుండా చంద్రబాబు ఓ మీడియా సమావేశంలో ఇక్కడ భూములు కొంటె తప్పేముంది.. కోనోద్దని ఎ చట్టంలో రాసి ఉందని అన్నారు.. ఇది దుమారం రేగగా తాజాగా ఇప్పుడు అదే తరహ మాటలు టీడీపీ నేత బొండా ఉమా కూడా చేయడం ఆసక్తి కరంగా మారింది.. ఏపీ రెవెన్యూ, క్రిమినల్‌ చట్టాలలో లేని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను వైసీపీ నేతలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. సెబీ కంపెనీ చట్టాల్లో ఉన్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను చూపించి అమరావతిని చంపాలని ప్రయత్నిస్తున్నారని బొండా ఉమా సరికొత్త విషయం చెప్పారు.

అయితే మొదటినుంచి ఈ విషయంలో మేము ఎలాంటి తప్పు చేయలేదు, నిజాయితి గా ఉన్నాము అని టీడీపీ నేతలు చెప్తున్నారు..  తాము ఇంత నిజాయితి వంతులు అయితే టీడీపీ హయంలో అంత అవినీతి ఎలా జరిగింది ఎందుకు వారు జైలుకు వెళ్తున్నారు అని అంటున్నారు వైసీపీ నేతలు.. ఎ తప్పు చేయకపోతే ఎందుకు విచారణను అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లారు. అమరావతి భూ కుంభకోణంపై ఎలాంటి దర్యాప్తు జరగకుండా స్టేలు తెచ్చుకోని.. మళ్లీ నేడు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని చెప్పుకొస్తున్నారు.భూములు కొనకూడదని ఏ చట్టంలో ఉందో చెప్పాలంటున్న బొండా ఉమా.. అలా భూములు కొనడం తప్పు కానప్పుడు ఎవరు..? ఎలాంటి విచారణ చేస్తే వచ్చే నష్టం ఏముంటుదని కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నారో ముందు చెప్పాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: