ఇంకేముంది తెలంగాణ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రాములమ్మ అలియాస్ విజయశాంతి బిజెపిలో చేరి పోతున్నారని కొద్దిరోజులుగా ఒకటే ప్రచారం జరుగుతోంది. ఆమె కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో భేటీ అయ్యారని, ఆమెకు కీలక పదవి దక్కబోతుంది అంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతూ వస్తోంది. అలాగే ఉప ఎన్నికలకు ముందే ఆమె బిజెపిలో చేరిపోతారని, కాంగ్రెస్ కు జలక్ ఇస్తారని హడావుడి నడిచింది. దీనికి తగ్గట్టుగానే ఆమె గత కొంత కాలంగా కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.


 కాంగ్రెస్ తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నా, ఆమె ఇక్కడ అభ్యర్థి తరఫున ప్రచారానికి దిగడం లేదు. దీంతో ఆమె బిజెపిలోకి వెళ్లే వార్త నిజమేనని ప్రచారం జరుగుతోంది. ఆమె బిజెపిలో చేరే విషయమై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. అయినా ఆమె స్పందించడం లేదు. బీజేపీలో చేరుతానని కానీ, చేరట్లేదు అని కాని చెప్పడం లేదు. అయితే తాజాగా విజయశాంతిని బుజ్జగించేందుకు పిసిసి దూతలు కొంతమంది ఆమె దగ్గరకు వెళ్లగా, తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారట. రాబోయే జిహెచ్ఎంసి , మిగతా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే తక్షణమే పిసిసి ప్రక్షాళన చేయాలని, పిసిసి బాధ్యతలు తనకు, కానీ, రేవంత్ కు కానీ అప్పగించాలంటూ ఆమె చెప్పినట్లు గా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. 


అయితే ఈ వార్తల్లో నిజం ఉందో లేదో స్పష్టంగా తెలియకపోయినా, ఇప్పటికీ ఆమె మాత్రం సైలెంట్ గా ఉంటూ వస్తుండడంతో, ఎవరికి వారు ఆమె పార్టీ మార్పుపై స్పందిస్తూ తమకు తోచిన విధంగా ఊహాగానాలు రేపుతున్నారు. ఎన్నికల వేళ విజయశాంతి ఈ విధంగా వ్యవహరించడంపై కాంగ్రెస్ నాయకులోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: