చంద్ర బాబు రాజకీయం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే.. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు , ఏ ఎండకా గొడుగు, అనే ఇలాంటి పేర్లు  ఆయనను చూసే పుట్టాయని చెప్పొచ్చు.. సుపరిపాలనను అందిస్తున్న జగన్ ను చంద్రబాబు ఎంత విమర్శించాలో అంతకు మించి విమర్శిస్తున్నారు..అయన తీసుకున్న నిర్ణయాలు ఎందుకు పనికి రావన్నట్లు చంద్రబాబు తీసిపారేయడం చూశాం.. తాను అధికారంలో ఉన్నప్పుడే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఎన్ని తీసుకున్నారో ఆయనే చెప్పాలి.. ఇంత అనుభవం, సీనియర్ నని చెప్పుకు తిరిగే ఆయనను సొంత పార్టీ నేతలే తిడుతున్నారంటే ఆయనకు రాజకీయం చేసే వయసు ఓపిక లేవని చెప్పాలి..

మెయిన్ గా జగన్ తీసుకున్న వాలంటీర్ల వ్యవస్థ నిర్ణయాన్ని టీడీపీ చాలా వ్యతిరేకిస్తూ వచ్చింది.. దీనివల్ల ఒరిగేదెంలేదని జగన్ ను ప్రజల దృష్టిలో విలన్  చేసే విధంగా మాట్లాడింది..  దేశవ్యాప్తంగా ఇన్ని ప్రశంసలు లభిస్తుంటే.. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు మాత్రం ఇంకా వ‌లంటీర్ వ్యవస్థను విమ‌ర్శిస్తూనే ఉన్నారు. వారికి మింగుడు ప‌డ‌ని ఓ విష‌యం మ‌రో రాష్ట్రం తీసుకుబోతోంది. త‌మ రాష్ట్రంలోనూ వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ప్ర‌వేశ‌పెట్టే విష‌యాన్ని ఆలోచిస్తామ‌ని, ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్తాన‌ని అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ షేక్‌ ఆరిజ్‌అహ్మద్ తెలిపారు.

అయితే తాము ఏదైతే వద్దని విమర్శించామో అదే నిర్ణయాన్ని ఇతర రాష్ట్రాలు తీసుకోవడం ఇప్పుడు టీడీపీ కి మింగుడు పడడం లేదు..  దీనిపై ఆ రాష్ట్రం చేస్తున్న పొగడ్తలు చూస్తుంటే టీడీపీ కి సుత్తి తో కొడుతున్నట్లు అనిపించడం ఖాయం అని తెలుస్తుంది..ఆరిజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ అసోం రాష్ట్రానికి ఈ వ్యవస్థ పనితీరును గురించి సవివరంగా రిపోర్ట్‌ అందచేయనున్నట్లు తెలిపారు.స్వ‌ప‌క్ష‌మైనా, విప‌క్ష‌మైనా ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంటే ప్రోత్స‌హించ‌క‌పోయినా నిరుత్సాహ‌ప‌ర‌చ‌కూడ‌దు. అసోం రాష్ట్రం వెల్ల‌డించిన నిర్ణ‌యంతోనైనా వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ వ‌ల్ల క‌లుగుతున్న లాభాల‌ను టీడీపీ గుర్తిస్తే మంచిది అని ప్రజలు కోరుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp