వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ఈ సమయంలో ఏపీ సీఎంగా జగన్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుని,  మరెన్నో సంచలనాలకు కారణమయ్యారు. అదే సమయంలో ప్రభుత్వం లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున రాద్దాంతం చేస్తున్నాయి. అలాగే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా ? వాలంటీర్ల వ్యవస్థ, ప్రతి పనిలోనూ పారదర్శకత, ఇలా అన్ని విషయాల్లోనూ ఎన్నో సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్ని జరుగుతున్నా,  ఏపీ సీఎం జగన్ మాత్రం ఎక్కడ నోరు విప్పేందుకు ఇష్టపడడం లేదు. ప్రతిపక్షాల పై విమర్శలు చేసేందుకు కాని, వారి విమర్శలకు సమాధానం చెప్పే విషయంలో కాని, తాను ఏం చేయాలనుకుంటున్నాను అనేది ప్రజలకు చెప్పేందుకు కానీ, తనకు వచ్చిన క్రెడిట్ ను గొప్పగా చెప్పుకునేందుకు గాని , ఇలా ఏ విషయమైనా వైసీపీ లోని కీలక నాయకులు స్పందిస్తున్నారు తప్ప, జగన్ మాత్రం ఎక్కడా దొరకడం లేదు.


  అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలను కూడా జగన్ అధికారులు మంత్రాలతో చెప్పిస్తూ,  అధికారికంగా మీడియా సమావేశాలు నిర్వహించేందుకు కూడా జగన్ ఇవ్వడం లేదు. అప్పుడప్పుడు జాతీయ మీడియాతో మాట్లాడుతూ వస్తున్నారు తప్ప మిగతా ఎక్కడ జగన్ నోరు విప్పడం లేదు. ప్రస్తుతం ఏపీలో ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ వాయిదా పడింది. అలాగే రాజధాని అమరావతి లో ఇంకా నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఇంకా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా జగన్ ఎక్కడ నోరు తెరవడం లేదు. అంతేకాకుండా అంతర్వేది లో ఆలయ రథం దగ్ధం అవడం ఇలా ఏ విషయమైనా జగన్ మాత్రం స్పందించడం లేదు. 



కేవలం  పార్టీకి చెందిన కీలక వ్యక్తులు స్పందిస్తున్నారు. ఇక వైసీపీలో ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మధ్య వివాదాలు ఏర్పడుతున్నా,  ఏ రకంగా చూసుకున్నా జగన్ ప్రభుత్వం కష్టాలను ఎదుర్కొంటోంది .అయితే ఈ వ్యవహారాలపై స్పందించాల్సిన జగన్ సైతం సైలెంటుగా ఉండిపోవడం తెలుగు రాష్ట్రాల్లో మీడియా కు దూరం దూరం అవుతున్నారు. ఇలా ఎన్నో అంశాలు ఆయనకు చేటు తెచ్చే విధంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో నుంచి బయటపడి, ప్రజలకు తాను చెప్పాలనుకున్న విషయాలను సూటిగా చెప్పేందుకు  తెలుగు రాష్ట్రాల్లో మీడియా ముందుకు వచ్చేందుకు జగన్ సాహసించడం లేదు. ఇవన్నీ వైసిపికి ఇబ్బందికరంగా మారాయి. జగన్ నోరు తెరిచి తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తూ ఉంటే, ఇంత అనవసర గందరగోళం తలెత్తి ఉండేది కాదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: