రాష్ట్రంలో  మరో మారు ఎన్నికల సందడి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు బాకీ ఉండడంతో ఆ కార్యక్రమం పూర్తి చేయడానికి ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెడీ అవుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే లోకల్ బాడీ ఎన్నికలను డిసెంబర్లో జరిపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ ఎన్నికలకు అధికార పార్టీ సిధ్దమేనా అన్నది ఇప్పటికీ ఒక చర్చగానే ఉంది. కోర్టు ఆదేశిస్తే ప్రభుత్వం కూడా ఎన్నికలకు అడుగులు వేయాల్సిందేనని అంటున్నారు.

అంటే డిసెంబర్ చలికాలం ఏపీలో లోకల్ ఫైట్ గట్టిగానే  జరుగుతుంది అన్న మాట. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరిది విజయం మరెవరిది పరాజయం అన్న చర్చ కూడా వస్తోంది. అయితే దానికి సమాధానం కూడా చాలా సింపుల్. లోకల్ బాడీ ఎన్నికలు ఎంటూ అధికార పక్షానికి అనుకూలంగా ఉంటాయి. పైగా అధికారం చేతిలో ఉంటుంది. అర్ధ బలానికి కూడా లోటు లేదని అనుకోవచ్చు. కానీ ఏపీలో సీన్ అలా ఉందా అంటే క్షేత్ర స్థాయిలో మాత్రం కచ్చితంగా వేరేలా ఉందనే అంటున్నారు.

ఇవి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కావు, పైగా జగన్ ఫేస్ చూసి ఓటు వేసే ఎన్నికలు కూడా కావు. పక్కా లోకల్ ఎన్నికలు, పూర్తిగా క్యాడర్ బేస్ ఉన్న పార్టీలకే ఈ ఎన్నికల్లో లబ్ది చేకూరుతుంది. ఆ విధంగా చూసుకుంటే టీడీపీ గ్రౌండ్ లెవెల్లో చాలా బలంగా ఉంది. అంతే కాదు, ఆ పార్టీకి పెట్టని కోటలా లక్షలాది మంది కార్యకర్తల బలం ఉంది. ఇక ఏడాదిన్నరగా జగన్ సాగిస్తున్న పాలన మీద కూడా కొంత చర్చ సాగుతుంది. దాంతో ఓటర్లలో కూడా మార్పు వస్తుంది అంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల నాటి ఊపు అయితే వైసీపీలో ఇపుడు  లేదు అని కూడా అంటున్నారు. మరో వైపు వైసీపీ క్యాడర్ కూడా నిరాశలో ఉండడం, చాలా చోట్ల పార్టీ సంస్థాగత నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పటికిపుడు పెడితే రిజల్ట్  వైసీపీకి తేడా కొడుతుందని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: