సాధారణముగా రాష్ట్రంలో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు లేదా సమస్యలు ఉంటే సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తుంటారు. అలాంటిది ఇక్కడ ఎమ్మెల్యే కి ఒక కష్టం వచ్చి పడింది. నేను మోసపోయానని ఏపీ లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు సంబంధిత విభాగానికి చెందిన అధికారికి ఫిర్యాదు చేయడం ఇప్పుడు ఏపీ లో రాజకీయంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై నలుగురు నాలుగు విధాలుగా ప్రభుత్వం గురించి చర్చించుకుంటున్నారు. సొంతపార్టీ ఎమ్మెల్యే కి ఈ విధంగా జరిగితే మరి సామాన్య ప్రజల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. మరి అసలేమి జరిగిందో తెలుసుకోవడానికి కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ను చదవండి.

ఏపీలో ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్వయంగా రైతు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈయన వరి పంట వేయడానికి గాను ఏపీ సీడ్స్ దగ్గరనుండి నాణ్యమైన వరి విత్తనాలను కొనుగోలు చేసారు. తన నియోజకవర్గంలోని వేమవరం గ్రామంలో వీటిని పొలంలో వేశారు, అయితే నాట్లు వేసిన తరువాత నాలుగు రోజుల క్రితం వెళ్లి పంటను పరిశీలించగా అనుకున్నంతగా వరి కంకు పెరగలేదు. సరి అయిన దిగుబడి రాదని నిర్ధారించుకున్న ఆళ్ల రామకృష్ణా రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. వెంటనే ఈయన వ్యవసాయ జేడీ విజయభారతి కి ఫిర్యాదు చేసారు.  

ఆమెను నాసిరకం విత్తనాలను ఇచ్చినందుకు దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేసారు. వెంటనే స్పందించిన జేడీ విజయభారతి బాపట్లలో వ్యవసాయ శాస్త్రజ్ఞులను విచారణ నిమిత్తం ఆదేశించినట్లు తెలిసింది. అయితే ఇక్కడ కొసమెరుపేంటంటే రైతులంతా ప్రభుత్వం అందించే విత్తనాలపై నమ్మకముతో ఉంటారు. మరియు ఎక్కువ మొత్తంలో విత్తనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యే కి నాసిరకం విత్తనాలను పంపిణీ చేస్తే, ఇక రైతుల పరిస్థితిని మీరు ఊహించుకోగలరు. విత్తనాల నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు ఏంచేస్తున్నారో తెలియని పరిస్థితి. ఇకముందైనా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: