ఏ ఒక్కరిని వదిలిపెట్టేలా కనిపించడం లేదు. శత్రుశేషం ఉంటే ముందు ముందు రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కారణం తో, ప్రధాన రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే కాకుండా, తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థిని ఏమి చేయకుండానే వారి చుట్టూ ఉన్న వారిని దెబ్బతీయడం ద్వారా భయాందోళనకు గురి చేయాలనే ఎత్తుగడకు వైసీపీ ప్రభుత్వం వచ్చినట్టుగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే ఇదే విషయం అర్థమవుతోంది. ప్రస్తుతం వైసిపి ముందుకు వెళ్తున్న తీరుతో ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏ క్షణం ఎవరిపై ఈ విధంగా దాడులు జరుగుతాయి ? ఎవరు టార్గెట్ అవుతారో తెలీయక ఎవరికి వారు ఆందోళనలో ఉన్నారు.



 ప్రస్తుతం బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ కు చెందిన గీతం యూనివర్సిటీ అక్రమ నిర్మాణాల వ్యవహారంపై వైసిపి ప్రభుత్వం పూర్తిగా టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికే కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా, తాజాగా గీతం యూనివర్సిటీ నిబంధనల ఉల్లంఘన పై యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ఇంద్రపాల్ సింగ్ కు విజయ సాయి రెడ్డి లేఖ రాశారు. గీతం యూనివర్సిటీ లో లోపాలపై కేంద్ర మంత్రి రమేష్ పోక్రియాల్ కు సైతం లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో అనేక అంశాలను ప్రస్తావించారు. గీతం డీమ్డ్ బి యూనివర్సిటీ హోదాలో ఉండడంతో, ఆ హోదాను పొందేందుకు నిబంధనలు ఉల్లంఘించారని vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భూమి యాజమాన్య హక్కు పత్రాలు సమర్పణలో ఎన్నో వాస్తవాలను దాచిపెట్టి, యూజీసీ కిచ్చిన నివేదికలు ప్రభుత్వ భూమిని కూడా గీతం యాజమాన్యం చూపించిందని పేర్కొన్నారు. ఇంకా గీతం యూనివర్సిటీ కి సంబంధించి ఎన్నో ఫిర్యాదులను విజయసాయిరెడ్డి చేయడంతో పాటు, ఈ వ్యవహారాల్లో ఎక్కడా వెనక్కి తగ్గకుండా తమ పంతం నెరవేర్చుకోవాలని విధంగా ప్రయత్నిస్తున్నారు. 



అయితే ఈ ఒక్క అంశమే కాకుండా టిడిపి కీలక నేతల కు సంబంధించి లొసుగులను, అక్రమ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తోంది. అలాగే భవిష్యత్తులో టిడిపి తరఫున యాక్టివ్ గా ఉండే అవకాశం ఉన్న  నాయకుల వ్యవహారాలన్నిటినీ బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు గా కనిపిస్తోంది. అలాగే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లకు సంబంధించిన వ్యవహారాలపై నా వైసిపి ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: