పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు జగన్ నామస్మరణ చేయందే టీడీపీ అధినేత చంద్రబాబుకు నిద్ర పట్టేలా కనిపించడంలేదు. నిత్యం ఏదో ఒక అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూనే రావడం ఏడాదిన్నరగా బాబుకి బాగా అలవాటైపోయింది. దీంతో ఆయన చేసే విమర్శలను, ఎవరూ పెద్దగా పట్టించుకోనట్టు గానే కనిపిస్తున్నారు. బాబు ఎప్పుడూ ఇంతే ఎవరో ఒకరిని విమర్శించందే ఆయనకు నిద్ర పట్టదు అనే అభిప్రాయం జనాల్లో వచ్చేసింది. దీంతో బాబు విమర్శలు చేస్తున్నా, అది వైసీపీ ప్రభుత్వానికి కలిసి వస్తుంది. ఏపీ సీఎంగా జగన్ విఫలమయ్యారని , ఆయనకు పరిపాలన చేత కావడం లేదని, అదే తాను ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే, ఏపీ ఈపాటికి ఎంతో అభివృద్ధి చేసి ఉండేవాడిని అని బాబు పదేపదే చెబుతుండడం, ఆయనను మరింత విమర్శలు పాలు చేస్తోంది. 

ఆంధ్ర, తెలంగాణ విభజన తర్వాత టిడిపికి జనాలు పట్టం కట్టారు. ఐదేళ్ల కాలంలో ఏపీ ని ఎంతో అభివృద్ధి చేస్తున్నాము అన్నట్లుగా హడావుడి చేశారు తప్ప పెద్ద గా అభివృద్ధి చేసిందేమీ లేదనేది ప్రజల అభిప్రాయం. ప్రతిపక్షాల విమర్శలకు అందకుండా, సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో జగన్ ను ఎవరు ఢీకొట్టలేరు అనే విధంగా ముందుకు వెళుతున్నారు. కరోనా కష్ట కాలంలోనూ, ప్రజలకు వివిధ పథకాల ద్వారా, సొమ్ములు అందించి, వారిని అన్ని విధాలుగా ను ఆదుకున్నారు.ప్రతి విషయంలోనూ,  పారదర్శకతకు పెద్దపీట వేస్తూ,  ముందుకు వెళ్తున్న తీరుతో వైసిపి ఇప్పటికీ మంచి ఆదరణ పొందుతూ వస్తోంది. ప్రజల ప్రశంసలు అందుకుంటూ వస్తున్న వ్యవహారాలలోనూ, వైసిపి ప్రభుత్వంపై బాబు విమర్శలు చేస్తుండడం వంటివి టీడీపీ పై ప్రజల్లో చులకన భావం ఏర్పడే విధంగా చేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం పై ఎంత నెగిటివ్ గా ప్రచారం చేసి, రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నా, అది సాధ్యమే కావడం లేదు. టీడీపీ నాయకుల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


 నిత్యం అదేపనిగా జగన్ నామస్మరణ చేస్తూ విమర్శలు చేస్తూ ఉండడం తో ప్రజల్లో తమ పార్టీకి చులకన భావం ఏర్పడటంతో పాటు, వైసిపి నిజమైన తప్పిదాలను ఎత్తి చూపించినా, పెద్దగా ఎవరు నమ్మరు అని, ప్రతి అంశాన్ని హైలెట్ చేస్తూ రాజకీయం చేయాలని చూస్తే, ఎదురుదెబ్బలు తప్పవంటూ హెచ్చరికలు కింది స్థాయి నాయకులు చేసే వరకు పరిస్థితి వెళ్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: