తెలంగాణ లో  రోజురోజుకి కరోనా కేసులు వస్తూనే వున్నాయి ..తెలంగాణ లో తగ్గినట్టు చెబుతున్న ఈ కేసులు ఎలా వస్తున్నాయి . దీని బట్టి చూస్తే ప్రజలు ఎంత ఆజాగ్రత్తగా  ఉంటున్నారో అర్థం అవుతుంది . ఈ మధ్య సినిమా ప్రముఖులకు ,రాజకీయ ప్రముఖులకు కూడా కరోనా పాజిటివ్ వస్తున్నాయి ... అంతకు ముందు అంతగా రాని కరోనా కేసులు ఇప్పుడు వస్తున్నాయంటే మొన్నటి పండగలు కారణమా ? గత సంవత్సరం కంటే ఏ సంవత్సరం ఆశించినంతగా పండగలు అయితే జరుపబడలేదు ... ఒక్క ఆ పండగలు కాదు ఈ సంవత్సరం మొత్తం పండగల పరిస్థితి అంతే ..  కరోనా ఇప్పట్లో అయితే పోదు.. కేసులు కూడా రాకుండా పోవు ..

ఇక రాష్ట్రంలో బుధవారం రోజు 1504 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,35,656కి చేరింది. బుధవారం ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,324కి చేరింది.  దీంతో కోలుకున్నవారి సంఖ్య 2,16,353 కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 91.80 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 17,979 యాక్టివ్‌ కేసులకు గాను 14,938 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది....అయితే కరోనా రిపోర్ట్ జిల్లాల వారికీ ప్రకటించే వైద్య ఆరోగ్య శాఖ కొన్ని నెలల తర్వాత రిపోర్ట్ ని పంపించకుండా అపి వేసింది .. ఎవరి జిల్లాలో చూసుకున్న 10 కరోనా కేసులు వచ్చిన్నట్లు చెపుతున్న అవి నిజమేనా అని సందేహం వస్తుంది .. ఇంకా భయపడి కరోనా వచ్చిన చెప్పుకున్న వారి యొక్క రిపోర్ట్ తీస్తే ఇంకెంతమంది ఉంటారో ఆలోచించండి ...

అయితే తాజాగా మరో తెలంగాణ ఎమ్మెల్యే కి కరోనా సోకింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే,‌ రేగా కాంతారావుకు కరోనా వైరస్ నిర్దారణ అయ్యింది . కొన్ని రోజులుగా తాను అస్వస్థతకు గురికావడంతో పరీక్ష చేయించుకున్నానని, దీంతో కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిందని వివరించారు. .





మరింత సమాచారం తెలుసుకోండి: