ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఏంటి అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను చాలావరకు సీరియస్గా తీసుకున్నా సరే ప్రస్తుతం  కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఇప్పుడు సీఎం జగన్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కొంతమందికి కీలక బాధ్యతలు అప్పగించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. జిల్లాల వారీగా నేతలకు కీలక బాధ్యతలను ఇచ్చి... స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను చూడాలని పార్టీ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుకు వెళ్లాలని సీఎం జగన్ సూచిస్తున్నారు. ఎన్నికల సంఘం ఎలా వ్యవహరించినా సరే మనం మాత్రం చాలా సమర్థవంతంగా ముందుకు వెళ్దామని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కార్యకర్తలు ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా,

అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కడైనా ఇబ్బందులు వస్తే కచ్చితంగా దానిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా కూడా ముందుకు వెళ్లాలని ఆయన పార్టీ నేతలకు సూచిస్తున్నారు. సీనియర్ నేతలతో ఆయన ఒక కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసే కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని సీఎం జగన్ సూచించే అవకాశం ఉందని పలు వ్యాఖ్యలు చేశారు, అది ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ... ఇప్పుడు సీనియర్ నేతలకు మాత్రం ఒక్క జిల్లా అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి ముందడుగు పడే అవకాశం ఉంది,  చూడాలి మరి ఏమవుతుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: