తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలు ఏ రేంజ్ లో హిట్ పెంచుతున్నాయి అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో అనేదానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దుబ్బాకలో సీఎం కేసీఆర్ ప్రచారం చేసే అవకాశం ఉందని ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి. ఐతే సీఎం కేసీఆర్ తాజాగా ఉప ఎన్నికలు అసలు మాకు లెక్క కాదని తాము ఖచ్చితంగా విజయం సాధిస్తామని... భారీ మెజారిటీతో గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. దీంతో విపక్షాలు కూడా కాస్త ఆలోచనలో పడ్డాయి.

సీఎం కేసీఆర్ ప్రచారం చేసే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అందరూ అన్నారు. కానీ మంత్రి హరీష్ రావు కూడా సీఎం కేసీఆర్ ని ప్రచారానికి వద్దని చెప్పారు అని తానే మొత్తం చూసుకుంటానని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. మరో మంత్రి కేటీఆర్ కూడా ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉండవచ్చని అందరూ భావించారు. కానీ ఆయన కూడా ప్రచారానికి రావొద్దు అనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఏది ఎలా ఉన్నా సరే ఈ ఎన్నికల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేసిన విధానం మాత్రం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో కొత్త భయాలను సృష్టిస్తోంది.

భవిష్యత్తులో ఏ విధంగా పరిణామాలు ఉంటాయో అని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ బిజెపి దూకుడు చూస్తుంటే భవిష్యత్తులో ఏ విధమైన అవకాశాలు బీజేపీ సృష్టించుకుని ముందుకు వెళ్తుందో అంటూ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ తర్వాత క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. మరి బిజెపి ని ఏవిధంగా టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: