టాయిలెట్స్‌కు వేసిన రంగుల కారణంగా రచ్చ రచ్చ జరిగింది.మొదట ఉత్తర ప్రదేశ్‌ లో రంగుల కారణంగా అభ్యంతరం వ్యక్తమైంది. అసలేం జరిగింది...? ఈ విషయం లోకి వస్తే.....  అక్కడ టాయిలెట్‌కు ఆ రాష్ట్రం లోని ప్రధాన రాజకీయ పార్టీ జెండా లోని రంగులే వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా ఆ ఫొటోస్ వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌ రైల్వే ఆస్పత్రి ఎదురుగా ఉన్న టాయిలెట్‌ లో ఎరుపు, ఆకుపచ్చ రంగుల టైల్స్‌ను వేశారు. అయితే ఇవి  కాస్త సమాజ్‌వాదీ పార్టీ జెండా లోని రంగులను పోలి ఉండటం కారణంగా  ఆ పార్టీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది.

దీని మూలం గానే అధికారులు వెంటనే రంగం లోకి దిగాల్సి వచ్చింది. వెంటనే టాయిలెట్‌కు ఉన్న రంగులను వాళ్ళు  మార్చేయడం జరిగింది. సమాజ్‌వాదీ పార్టీ దీని పై సీరియస్ అయ్యింది. ఇలా ఇటువంటి  చర్యల వల్ల మనకి కాదు ఏకంగా రాజ్యాంగానికే అవమానమని చెప్పింది. అంతే కాదు తప్పక ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని వెంటనే తొలగించాలని కోరింది. అలానే రైల్వేమంత్రి పియూష్ గోయల్‌ కు ఫిర్యాదు కూడా ఈ ఘటన మేరకు చేసింది. ఎస్పీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ సజ్జన్  ఇలా అన్నారు....బీజేపీ కలుషితమైన మనస్తత్వానికి ఇదే నిదర్శనమని, రాజకీయాల్లో బీజేపీ మరింతగా దిగజారిందని ఆరోపించారు.

ఈ రంగులు వేయడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌ లో భాగంగా కొన్నేళ్ల క్రితమే వాటిని అక్కడ వేశారని వాళ్ళు చెప్పడం జరిగింది. దీని వెనుక ఏ రాజకీయాలు లేవని కేవలం క్లీన్ గా ఉంచాలన్నదే తమ ధ్యేయం అన్నారు. అలానే స్వచ్ఛ భారత్ మిషన్‌కు అంతా సహకరించాలని అధికారులు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: