రామాయణంలో మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. అయితే రామాయణంలో పుష్పక విమానం గురించి తెలియని వారంటూ ఉండరు.  పురాణాలలో ప్రస్తావించబడ్డ గాలిలో ఎగరగలిగే ఒక వాహనం. ఎంతమంది ఇందులో కూర్చున్నా మరొకరికి చోటు ఉండటం దీని విశేషం. ఇక రామాయణంలో పుష్పక విమానం గురించిన వర్ణన ఉంది. యుద్ధానంతరం సీతతో కూడి సకాలంలో అయోధ్య చేరడానికి రాముడు దీనిని ఉపయోగించాడు.

అయితే రావణుడు ఆ విమానాన్ని ఎలా త‌యారు చేయించాడు అనే సందేహాలు అందరికి వస్తుంటాయి. అయితే నిజానికి అస‌లు ఆ విమానం రావ‌ణుడిది కాదు. ప్రముఖ శిల్పి విశ్వకర్మ పుష్పక విమానాన్ని తయారు చేసి ఒకానొక సందర్భంలో బ్రహ్మకు ఇచ్చాడట. అందులో ఎంత మంది ఎక్కినా ఇంకొకరికి స్థానం ఉంటుందట. అంటే ఎందరైనా దాంట్లో ఎక్కవచ్చని అర్థం. ఈ క్రమంలో సదరు విమానాన్ని బ్రహ్మ కుబేరునికి ఇవ్వగా కుబేరుడు లంకను పాలిస్తూ దాన్ని తన వద్ద ఉంచుకున్నాడట. ఈ క్రమంలో రావణుడు కుబేరున్ని జయించి ఆ విమానాన్ని తాను ఆక్రమించాడట.

అనంతరం రాముడు రావణున్ని జయించగా ఆ విమానాన్ని రావణుడి తమ్ముడు విభీషణుడు తీసుకున్నాడట. ఆ క్రమంలో విభీషణుడు ఆ విమానంలో రామున్ని, అతని పరివారాన్ని లంక నుంచి అయోధ్యకు చేరుకుంటాడు. త‌రువాత దాన్ని రాముడు తిరిగి కుబేరుడికి ఇచ్చేస్తాడు. అందువ‌ల్ల ఆ విమానం అప్ప‌టి నుంచి కుబేరుడి వ‌ద్దే ఉంది. అయితే పుష్ప‌క విమానంలో ఎంత ఎంది ఎక్కినా ఇంకొక‌రికి చోటు ఉంటుంద‌ని చెబుతారు. దాన్ని అత్యంత విలువైన ర‌త్నాలు, లోహాల‌తో విశ్వ‌క‌ర్మ త‌యారు చేశాడు. అందువ‌ల్ల పుష్ప‌క విమానం వెల‌క‌ట్ట‌డం కూడా అసాధ్య‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. రామాయ‌ణంలో మ‌నకు అనేక చోట్ల పుష్ప‌క విమానం ప్ర‌స్తావ‌న క‌నిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: