దేశ అత్యున్నత న్యాయస్థానం మరో సంచలన తీర్పు వెల్లడించింది ఈ తీర్పు తో ఇకపై డ్రగ్స్ చట్టంలో మార్పులు రానున్నాయి ..సుప్రీం కోర్ట్ ఎన్నో చారిత్రాత్మక తీర్పులని చెప్పింది .. ఆ తీర్పుల వాళ్ళ దేశ భవిషత్తు మారనుంది . నిర్భయ చట్టం, రామజన్మభూమి తీర్పు , బాబ్రీమసీదు కూల్చివేత సంబంధించిన తీర్పు  ఎలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి ..మరి వివరాల్లోకి వెళ్తే  

సర్వోన్నత న్యాయస్థానం మరో చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. డ్రగ్స్, అక్రమ రవాణా కేసుల్లో నిందితులు ఇచ్చే వాంగ్మూలాలను వారిని శిక్షించేందుకు ఆధారాలుగా ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు  స్పష్టం చేసింది. నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ చట్టం కింద విచారణ జరుపుతున్న అధికారికి నేరం అంగీకరిస్తూ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఇక పై దానిని సాక్ష్యం గుర్తించకూడని తెలిపింది.

ఈ మేరకు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజార్టీతో ఈ తీర్పును గురువారం వెల్లడించింది ..ఈ కేసులో 163 పేజీల తీర్పును న్యాయమూర్తి  జస్టిస్‌ నారిమన్ చదివారు  ‌.. ఇదే అంశంపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన రెండు తీర్పులను కొట్టివేసింది .

నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్(NDPS)‌ చట్టంలోని సెక్షన్‌ 53 ప్రకారం ఇటువంటి కేసులను దర్యాప్తు చేసే వారిని పోలీస్ అధికారులుగానే ఉంటారు అని చెపుతుంది.. ఇక  ఎవిడెన్స్‌ యాక్ట్‌ సెక్షన్‌ 25 ప్రకారం, పోలీసు అధికారి ముందు నిందితుడు ఇచ్చే వాంగ్మూలాన్నే సాక్ష్యంగా పరిగణించరాదు. ఇక  నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్ చట్టంలోని సెక్షన్‌ 67 ప్రకారం విచారణ సందర్భంగా నిందితుడు చెప్పే వివరాలను నేర అంగీకార ప్రకటనగా భావించరాదు. ఈ సెక్షన్‌ ప్రకారం కేవలం సమాచారం రాబట్టే అధికారం మాత్రమే విచారణ అధికారికి ఉంది.

ప్రభుత్వ అధికారాలు, పౌరుల ప్రాథమిక హక్కుల మధ్య సున్నితమైన సమతౌల్యత అవసరం, అటువంటి హక్కుల నేపథ్యంలో నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్ చట్టం నిర్దేశించాల్సి ఉంది..అందువల్ల ఈ చట్టంలో అనేక భద్రతలు ఉన్నాయి, పౌరుల హక్కులను హరించకుండా ఈ మాదక ద్రవ్య చట్టంలో ఇకపై  ఈవిదంగా మార్పులు ఉంటాయని సుప్రీమ్ కోర్ట్ తెలిపింది .. 

మరింత సమాచారం తెలుసుకోండి: