ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో సీఎం జగన్ చాలా వరకు సీరియస్ గానే ఉన్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా సరే సీఎం జగన్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. అయితే కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజల్లో కాస్త సహనం ఉన్న నేపథ్యంలో ఆయన ఇప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉంది అనే వ్యాఖ్యలు వినపడుతున్న నేపథ్యంలో ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సంక్షేమ కార్యక్రమాలు అమలు, సంక్షేమ కార్యక్రమాల పనితీరు ఎలా ఉంది...? అవి మీకు ఉపయోగపడ్డాయో లేదా స్థానిక నాయకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకు సంక్షేమ కార్యక్రమాలు అందించారా...? అధికారుల పనితీరు ఎలా ఉంది అనే ప్రశ్నలతో ఇప్పుడు ఒక సర్వే నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. రాజకీయంగా కూడా విపక్షాలు కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో సీఎం జగన్ కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక కీలక అడుగు పడే అవకాశం ఉందని అంటున్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో స్థానిక నాయకుల పెత్తనం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారిని పక్కకు తప్పించే విధంగా కూడా సీఎం జగన్ వ్యవహరిస్తున్నా.రు ఇక ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దీనితో వారికి కూడా నేరుగా వార్నింగ్ ఇవ్వాలని భావిస్తున్నారట. భవిష్యత్తులో ఏ విధంగా పరిణామాలు ఉంటాయి ఏంటి అనేది చూడాలి. త్వరలోనే ఈ సర్వే మొదలుకానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: