ఆంధ్రప్రదేశ్ కి పోలవరం ప్రాజెక్టు అనేది చాలా కీలకం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్టు ద్వారానే ఇప్పుడు ఏపీలో అభివృద్ధి అనేది ముందుకు వెళుతుందని చాలామంది అంటూ ఉంటారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చాలా వరకు కూడా సీఎం జగన్ ఇప్పుడు సీరియస్ గానే ఉన్నారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసింది అనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తి చేయాలని సీఎం జగన్ టార్గెట్గా పెట్టుకుని ముందుకు అడుగులు వేస్తున్నారు.

అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాత్రం పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్ కి కాస్త గట్టిగానే షాకిచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిధులను భారీగా తగ్గించి కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించింది. 55 వేల కోట్లకు పైగా ఉన్న నిర్మాణ వ్యయాన్ని 20 వేల కోట్లకు మాత్రమే పరిమితం చేస్తూ ఆ 20 వేల కోట్లు మాత్రమే ఇస్తామని చెబుతోంది. దీంతో సీఎం జగన్ కాస్త ఇబ్బంది పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆయన ఎంత జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి అని భావించిన కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో సీఎం జగన్ ఉన్నారు.

జాతీయ ప్రాజెక్టు అయినా సరే నిధులను కేటాయించే విషయంలో కేంద్రం ఇలా వ్యవహరించడంతో సీఎం జగన్ కాస్త కేంద్రం పై పోరాటం చేసే విధంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఎంపీలు ఎమ్మెల్యేలతో వేర్వేరుగా భేటీలు నిర్వహించి వారికి కొన్ని సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దీని ద్వారా మనకు జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు చెప్పాలని సీఎం జగన్ నేతలకు సూచించారు అవకాశాలు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: