ఎన్ని కటిన చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని  దారుణ శిక్షలు విధించినప్పడికి  రోజు రోజుకు సమాజం లో మహిళల కు రక్షణ కరువవుతోంది. ఏదో ఒక విధంగా మహిళలు అత్యాచారాలు దాడుల కు గురవుతూ నే  ఉన్నారు. కొంతమంది కామంతో కళ్లు మూసుకు పోయి ఆడపిల్ల కనిపిస్తే పశువుల్లా  మీద పడిపోయి కామవాంఛలు తీర్చుకుంటూ మహిళల జీవితాల ను నాశనం చేస్తుంటే... మరి కొంతమంది ఏకంగా మహిళల ప్రాణాల ను కూడా తీస్తున్న ఘటనలు ఎన్నో తెర  మీదకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలం లో ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలు మరింత ఎక్కువైపోతున్నాయి. ప్రేమ అనే ముసుగు లో ఎన్నో దారుణాల కు పాల్పడుతున్నారు.



 ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి ఓ యువతిని నమ్మించి చివరికి పెళ్లి విషయం వచ్చేసరికి ముఖం చాటేసి యువతిని శారీరకం గా మానసికం గా వాడుకొని నడిరోడ్డు మీద వదిలేస్తున్న ఘటనలు రోజు రోజుకు ఎక్కువవుతుంటే.. మరి కొంతమంది ఏకంగా ప్రేమోన్మాదులు గా మారిపోయి యువతి  ప్రేమించడం లేదు అన్న కారణంతో ఏకంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. కనీసం మనుషులం అనే విచక్షణ మర్చిపోతున్న ఎంతోమంది ప్రేమోన్మాదులు దారుణాలకు ఒడిగడుతున్నారు.


 ఇటీవలే భద్రాద్రిలో కూడా ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతిపై ఘాతుకానికి తెగబడ్డారు. జక్కుల సందీప్ అనే యువకుడు కత్తితో సౌజన్య అనే యువతిపై విచక్షణారహితంగా దాడికి దిగాడు.  యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రేమోన్మాది గా మారి పోయి రెచ్చిపోయిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు, ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: