తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన విఆర్ఓ ల నూతన జాబితా సమస్య, వీరి నియామకాల వ్యవహారం ఓ వైపు అయితే ప్రతిపక్షాల విమర్శలు మరోవైపు. దీని గురించి రోజూ ఏదో ఒక వార్త తెలంగాణ సర్కారును ప్రశ్నించేలా చేస్తున్నాయి. అయితే తాజాగా దీనికి స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చక్కటి శుభవార్తను అందించారు. వీలైనంత త్వరలోనే విఆర్ఓ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను పరిశీలించి అందుకు తగ్గట్టుగా విఆర్ఓ లని సర్దుబాటు చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

మా కర్తవ్యం ఎలాగో మేము నిర్వహిస్తాము కానీ.....విఆర్ఓ లపై కొన్ని మీడియా సంస్థలు మరికొందరు రాజకీయ ప్రముఖులు తెగ సానుభూతి చూపిస్తున్నారని, వారిని ప్రభుత్వ మేమీ బజార్లో పడేస్తామని ఎక్కడా చెప్పలేదని.... కాబట్టి వారు మరీ అంత వాపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి అతి త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామని  రాష్ట్రంలో ఏ ఒక్క విఆర్ఓ కూడా బాధపడాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో విఆర్ఓ నియామకాల విషయానికి ఓ క్లారిటీ లభించింది.

మరోవైపు భూముల విషయంలో అక్రమంగా ఆక్రమించుకుని వ్యూహాలు పన్ని.... వాటిని సొంతం  చేసుకున్న వారి అవినీతిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో అద్భుతంగా రూపొందించిన ధరణి పోర్టల్ ఆవిష్కృతమైంది. ఈ నేపథ్యంలో మూడు  చింతలపల్లిలో సీఎం కేసీఆర్ పోర్టల్ ఎంతో సంతోషంగా ప్రారంభించారు. నవంబర్ 2 నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. ధరణి పోర్టల్లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల రికార్డులు ఉన్నాయన్నారు. తెలంగాణ పోరాట యోధుడు వీరారెడ్డి పుట్టిన గ్రామం కాబట్టే ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి మూడు చింతలపల్లిని ఎంపిక చేసి ఈ మహా సంస్కరణకు ముందడుగు వేశామన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: