మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ పరిస్థితి చాల అధ్వాన్నంగా తయారైందన్న సంగతి తెలిసిందే.. ఒక్కొక్కరు గా టీడీపీ పార్టీ ని వీడుతూ చంద్రబాబు ను ఒంటరి చేస్తున్నారు.. వాస్తవానికి జగన్ ప్లాన్ కూడా అదే.. ఇప్పటివరకు తనమీద తీర్చుకున్న పగని జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఇలా పార్టీ కి ఒక్కొక్కరిని దూరం చేస్తూ పార్టీ పునాదులు లేకుండా చేస్తున్నాడని చెప్పొచ్చు.. ఇప్పటికే దాదాపు టీడీపీ లో మెయిన్ మెయిన్ లీడర్లు అందరు దూరమైపోయారు. ద్వితీయ శ్రేణి లీడర్లతో చంద్రబాబు తన పార్టీ ని నడిపించుకోవాలి.. ఇప్పుడు ఉన్న లీడర్లు కూడా వెళ్లిపోయేలా కనిపిస్తున్నారు..

ఇటీవలే  గల్లా అరుణకుమారి టీడీపీ పొలిట్ బ్యూరో నుంచి తప్పుకున్నారు. తమ ఆర్థిక, రాజకీయ అవసరాల కోసం గల్లా కుటుంబం కీలక నిర్ణయం తీసుకునే దిశలో సాగుతున్నట్టు కనిపిస్తోంది.దాంతో టీడీపీ కి వీరు వెళ్ళిపోతే ఎలాంటి గడ్డు పరిస్థితి ఎదురవుతుందో అని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు..కానీ వెంటనే చంద్రబాబు ఆ ఫ్యామిలీ కి రెండు పదవులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది..రెండేసి ప‌ద‌వులు పొందిన వారిలో కింజ‌రాపు కుటుంబం ఒక‌టైతే.. గ‌ల్లా ఫ్యామిలీ రెండోది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజ‌రాపు అచ్చెన్నాయుడు, ఆయ‌న అన్న కుమారుడు ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడుకు చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. అచ్చెన్నాయుడును ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేశారు. అదే స‌మ‌యంలో రామ్మోహ‌న్‌ను.. జాతీయ ప్రధాన కార్యద‌ర్శిగా ఎన్నుకున్నారు. ఈ ఇద్దరి విష‌యంలోను, ఈ కుటుంబానికి రెండు ప‌ద‌వులు ఇచ్చిన విష‌యంలో ఎక్కడా వివాదం లేదు. దీని వెనుక వ్యూహం కూడా లేదు. ఇద్దరూ క‌ష్ట‌ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని విజ‌యం సాధించారు. సో.. ఇచ్చారంటే.. అర్ధం ఉంది. మ‌రి గ‌ల్లా ఫ్యామిలీ విష‌యానికి వ‌స్తే.. మాత్రం ఈ ఫార్ములా తిర‌గ‌దిప్పింది. గుంటూరు ఎంపీగా యాక్టివ్‌గా ఉన్న గ‌ల్లా జ‌య‌దేవ్‌కు పొలిట్‌బ్యూరోలో అవ‌కాశం ఇచ్చారు. దీనిని ఎవ‌రూ కాద‌న‌డం లేదు. ఆయ‌న లాంటి వారి అవ‌స‌ర‌మే. కానీ, అదే స‌మ‌యంలో ఆయ‌న మాతృమూర్తి, మాజీ మంత్రి.. గ‌ల్లా అరుణ కుమారికి కూడా ప‌ద‌వి ఇవ్వడమే చ‌ర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: