ఒకప్పుడు జీవనశైలికి ప్రస్తుత జీవన శైలిలో ఎన్నో మార్పులు ఉన్న విషయం తెలిసిందే. ఆధునిక టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణం లో జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. అంతేకాకుండా మనుషుల యొక్క అలవాట్ల లో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆధునిక పోకడలో ఇమిడి  పోతున్న కొన్ని అలవాట్లు కొంత మంచి చేస్తూ ఉంటే కొన్ని అలవాట్లు మాత్రం చెడు చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఆధునిక పోకడల నేపథ్యంలో మనుషుల్లో వస్తున్న మార్పులు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తున్నాయి అనే దానిపై సర్వేల్లో  పలు ఆసక్తికర విషయాలు బయటపడుతూ ఉంటాయి.



 అయితే ఈ అధ్యయనాల్లో  బయటపడిన విషయాలు కొన్ని కొన్ని సార్లు నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. ఇటీవల తాజాగా ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయం బయట పడింది. రాను రాను భారతీయుల ఎత్తు క్రమక్రమంగా పెరుగుతోంది అన్నది తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. భారతీయులు క్రమక్రమంగా ఎత్తు పెరుగుతున్నారని తాజాగా పరిశోధకులు వెల్లడించారు. ప్రస్తుత జనరేషన్ లో పుడుతున్న  పిల్లలు అందరూ తమ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతున్నారని ఈ అధ్యయనం లో వెల్లడైంది.


 గత వందేళ్లలో సగటున భారతీయులు 3 సెంటీ మీటర్ల ఎత్తు వరకు పెరిగినట్లు జాతీయ పోషకాహార సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది. బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం మంచినీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మహిళ తీసుకుంటున్న జాగ్రత్తలు పోషకాహారం దృష్ట్యా భారతీయుల ఎత్తు పెరుగుదల పై ఎంతగానో ప్రభావం చూపుతున్నాయి అన్నది జాతీయ పోషకాహార సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అందుకే నేటి జనరేషన్ లో పిల్లలు తమ తల్లిదండ్రుల కంటే ఎంతగానో ఎత్తు పెరిగిపోతున్నారు అన్నది జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించింది. కేవలం ఎత్తు  మాత్రమే కాకుండా భారతీయులు క్రమక్రమంగా బరువు కూడా పెరుగుతున్నారు అన్నది గుర్తించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: