భారతదేశంలో కరోనా  వైరస్ రోజురోజుకూ పెరుగుతుంది తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ కరోనా వైరస్ కేసుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. వెరసి ప్రజల్లో ఆందోళన పెరిగిపోతూనే ఉంది. కరోనా వైరస్ సోకి ప్రాణాలు పోతాయి అని భయపడటం ఏమో కానీ కరోనా వైరస్ కారణంగా ఉపాధి కరువై దుర్భర స్థితిని గడుపుతున్నారు ఎంతో మంది ప్రజలు.. కనీసం తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న ఘటనలు కూడా ఎన్నో తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన సంస్థలు ఇప్పటికీ కూడా మళ్లీ పుంజుకోలేదు ఎంతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి కోల్పోయి ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



 ఇక  పేద సామాన్య ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రస్తుతం ఉచిత బియ్యం ఇస్తున్న తరుణంలో పేద సామాన్య ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్న విషయం తెలిసింది. అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి దాదాపు ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో ప్రభుత్వ సాయం కోసం  ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు బియ్యం అందించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తోంది.



 అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ఇబ్బందులతో దుర్భర స్థితిలో గడుపుతున్న ప్రజలందరినీ ఆదుకునేందుకు దేశంలో ఉచిత బియ్యం పంపిణీపై  కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతుండగా దీన్ని 2021 మార్చి వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కరోనా వైరస్ కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి.  ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోవడంతో ఎంతోమంది దుర్భర స్థితిని అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రానికి ఉచిత బియ్యం పంపిణీని పొడగించాలని వివిధ రాష్ట్రాలు కేంద్రాన్ని కోరగా.. దీనిపై సుముఖంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం వచ్చే వారంలో ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: