ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అన్న సంగతి తెలిసిందే.. ఆ పార్టీ ని ఓ కొత్త నాయకుడు వస్తే గానీ టీడీపీ గెలుస్తుందన్న ఆశలు ఇకపై సజీవంగా ఉండవు.. చంద్రబాబు కి  75 ఏళ్ళు పైబడిపోవడంతో ఇకపై పార్టీ నిడిపించే ఆలోచనలో అయన లేనట్లు తెలుస్తుంది.. పోనీ లోకేష్ కి పార్టీ బాధ్యతలు అప్పజెబుదామా అంటే లోకేష్ వద్దని సొంత పార్టీ నేతలనుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.. లోకేష్ పార్టీ బాధ్యతలు అప్పగించే సమయం ఇంకా ఉందని, రాజకీయంగా లోకేష్ ఇంకా ఎదగాల్సి ఉందని ఒకవేళ తొందరపడి ఇప్పుడు లోకేష్ పగ్గాలు అప్పజెప్తే పార్టీ భవిష్యత్ లో కనపడదని అంటున్నారు..

ఇక ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పార్టీ పట్టు తప్పిపోయింది.. అక్కడ వైసీపీ జెండా పాతి టీడీపీ ని కనపడనీయకుండా చేసేసింది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని ఆదోని లో తెలుగుదేశం పార్టీ ఉందా? లేదా? అన్న అనుమానం పార్టీలోనే వ్యక్తమవుతుండటం విశేషం.ఈ ప్రాంతం గతంలో పార్టీ చెప్పుకునే బలమైన స్థానాల్లో ఒకటి కాగా ఇప్పుడు ఇక్కడ అత్యంత దీన స్థాయికి జారిపోయింది.. 1994, 1999, 2009 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా మీనాక్షినాయుడు గెలిచారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో మీనాక్షినాయుడు వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మూడు సార్లు గెలిచిన మీనాక్షి నాయుడు ఇప్పుడు వయో భారంతో పెద్దగా యాక్టివ్ గా లేరు.

దీంతో ఆదోనిలో పార్టీ కార్యక్రమాలు పెద్దగా జరగడం లేదని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆశలు వదులుకునట్లే కన్పిస్తుంది. ఇక్కడ ఓ కొత్త లీడర్ అవసరమైతే ఉంది. కానీ ఈ టైం లో ఇక్కడ పార్టీ ని గెలిపించే లీడర్ ఎవరొస్తారనేది చూడాలి. ఇప్పుడైతే టీడీపీకి కంచుకోటగా నిలిచిన ఆదోని నియోజకవర్గంలో కూడా టీడీపీ జాడ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. మరి ఈ స్థితి నుంచి టీడీపీ ఎలా కోలుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: