కరోనా సమయం నుంచి కోలుకున్న ప్రజలు ఇప్పుడు యదేచ్ఛగా పనులను కొనసాగిస్తున్నారు.. ఈ విషయం పై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.. కరోనా సోకకుండా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి అంటూ గాలికి వదిలేసింది.. బ్రతికినోడు దొర, చనిపోయిన వాడు అయ్యో పాపం అని అంటున్నారు..ఈ కరోనా ఘట్టం ముగిసింది..ఇప్పుడు జీవనాన్ని ఎలా కొనసాగించాలి అనేది ప్రజలు ఆలోచనలో పడ్డారు..



ఇది ఇలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో చిక్కు వచ్చి పడింది. కరోనా తగ్గడంతో ప్రజలను వ్యాపారాలను కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు వాణిజ్య వ్యాపారాలను, విద్యా సంస్థలను కూడా తెరిచేందుకు ప్రభుత్వం అన్నీ చర్యలను తీసుకుంటున్నారు.ఈ మేరకు తెలంగాణలో గతంలో వాయిదా పడిన పరీక్షలను కొనసాగిస్తున్నారు.. పై తరగతులకు కావలసిన అనుమతుల కొరకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. వాటిని నిర్వహించడమే కాకుండా వాటికి సంబంధించిన ఫలితాలను కూడా దాదాపు విడుదల చేసింది. 



అయితే, తెలంగాణ లో ఎంసెట్ పరీక్షా ఫలితాలను సర్కార్ గత కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది.. ఇంటర్ పరీక్షలు కొన్ని వాయిదా పడిన సంగతి తెలిసిందే.. అయితే ఈ మేరకు కౌన్సిలింగ్ ను నిలిపివేయాలని కొందరు విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు.. ఎంసెట్ కౌన్సిలింగ్ లో కొన్ని తప్పులు జరిగాయని వాటిని వెంటనే రద్దు చేయాలని అనుకుంటారు.. విద్యార్థులు అందరికీ సమానంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. 45 మార్కులు ఇంటర్ వెయిటేజ్ ను తీసుకోవాలని అనుకున్నా కూడా పాస్ అయిన విద్యార్థులకు 35 మార్కులు తీసుకొని ర్యాంకులు ఇవ్వడం కాలేజీలో సీట్లు ఇవ్వటం సరికాదని కొందరు విద్యార్థులు కోర్టు మెట్లెక్కారు.. ఈ విషయం పై పూర్తిగా పరిశీలించిన కోర్టు కౌన్సిలింగ్ ప్రక్రియను నిలిపివేయమని ఆదేశాలు జారీచేసింది.. ఈ నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: